తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad : హైదరాబాద్ లో ఒక్క రోజే రూ.1.96 కోట్లు సీజ్, నగదు తరలింపు వాహనాల్లో ఎస్ఓటీ తనిఖీలు

Hyderabad : హైదరాబాద్ లో ఒక్క రోజే రూ.1.96 కోట్లు సీజ్, నగదు తరలింపు వాహనాల్లో ఎస్ఓటీ తనిఖీలు

29 April 2024, 20:40 IST

google News
    • Hyderabad : సైబరాబాద్ ఎస్ఓటీ బృందాలు...నగరంలోని 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో రూ.196 కోట్ల నగదు సీజ్ చేశారు.
 హైదరాబాద్ లో ఒక్క రోజే రూ.1.96 కోట్లు సీజ్
హైదరాబాద్ లో ఒక్క రోజే రూ.1.96 కోట్లు సీజ్

హైదరాబాద్ లో ఒక్క రోజే రూ.1.96 కోట్లు సీజ్

Hyderabad : సైబరాబాద్ ఎస్ఓటీ (Cyberabad SOT)బృందాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఇవాళ సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా 8 ప్రదేశాలలో రూ.1.96 కోట్ల నగదు పట్టుబడిందని పోలీసులు తెలిపారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో రూ. 1,81,70,324 నగదు సరైన క్యూఆర్ కోడ్‌లు, ఎన్నికల సంఘం ఇతర విధానాలు లేకుండా డబ్బు రవాణా చేస్తుండగా పట్టుకుని సీజ్ చేశారు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ వాహనంలో రూ. 15 లక్షలు అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.

ఏటీఎమ్ నగదు వాహనాల్లో తనిఖీల్లో

మేడ్చల్(Medchal) ఎస్ఓటీ టీమ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో BRINKS క్యాష్ లాజిస్టిక్స్ వాహనంలో రూ.74 లక్షల నగదు సీజ్ చేశారు. శంషాబాద్ ఎస్ఓటీ టీమ్ కొత్తూరు పోలీస్ స్టేషన్ CMS వాహనంలో రూ. 34 లక్షల నగదు సీజ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైటర్ సేఫ్ గార్డ్ వాహనంలో రూ. 21 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైటర్ సేఫ్ గార్డ్ వాహనంలో రూ.19 లక్షల నగదు సీజ్ చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీమ్ రాజేంద్రనగర్(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో రైటర్ సేఫ్ గార్డ్ వాహనంలో రూ.15 లక్షల నగదును సీజ్ చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీమ్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రైటర్ వెహికల్ లో రూ. 11 లక్షల నగదు సీజ్ చేశారు. బాలానగర్ ఎస్ఓటీ(SOT) టీమ్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేడియంట్ వెహికల్ లో రూ. 5.48 లక్షల క్యాష్ సీజ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ వ్యక్తి వాహనంలో రూ. 15 లక్షల నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు.

రాష్ట్రంలో రూ.104.18 కోట్లు పట్టివేత

లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా..... ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కకడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహణాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం, డబ్బు, డ్రగ్స్ ,ఉచితాలు మరియు ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 28 ( ఆదివారం ) వరకు మొత్తం రూ.104.18 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 477 ఎఫ్ఎస్టీ, 464 ఎస్ఎస్టీ బృందాలు 89 సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం వరకు రూ. 63.18 కోట్ల నగదు, రూ. 5.38 కోట్ల మద్యం, రూ.7.12 కోట్ల విలువైన మద్యం, రూ. 21.34 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు, రూ. 6.91 కోట్ల విలువ చేసే ఇతర వస్తువులు మరియు 7,174 లైసెన్స్డ్ ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పలు రకాల పేలుడు పదార్థాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ మొత్తం విలువ రూ. 104.18 కోట్లు

నగదు : రూ.63.18 కోట్లు

బంగారం : 34.33 కేజీలు

వెండి : 70.73 కేజీలు

మద్యం : రూ. 5.38 కోట్లు

మాదక ద్రవ్యాలు : రూ. 7.12 కోట్లు

ఉచితాలు : రూ.6.92 కోట్లు

లైసెన్స్ లేని అయుధాలు ( స్వాధీనం ) : 14

సరెండర్ అయిన ఆయుధాలు : 7,174

తదుపరి వ్యాసం