Siddipet Cash Seize : గజ్వేల్ లో వాహన తనిఖీలు, రూ.50 లక్షల నగదు సీజ్-siddipet news in telugu gajwel police vehicle checking 50 lakh cash seized ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Siddipet Cash Seize : గజ్వేల్ లో వాహన తనిఖీలు, రూ.50 లక్షల నగదు సీజ్

Siddipet Cash Seize : గజ్వేల్ లో వాహన తనిఖీలు, రూ.50 లక్షల నగదు సీజ్

HT Telugu Desk HT Telugu
Mar 23, 2024 08:51 PM IST

Siddipet Cash Seize : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.50 లక్షలు పట్టుబడ్డాయి. వాహనదారులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు.

రూ.50 లక్షల నగదు సీజ్
రూ.50 లక్షల నగదు సీజ్

Siddipet Cash Seize : సిద్దిపేట జిల్లా గజ్వేల్(Gajwel) పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలలో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి కారులో తరలిస్తున్న రూ. 50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బచ్చు రత్నాకర్ (45)గా గుర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో సీఐ సైదా, అడిషనల్ సీఐ ముత్యం రాజు, సిబ్బందితో కలసి గజ్వేల్ పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేశారు. కారులో 50 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళ్తుండగా గుర్తించి, ఆ నగదును సీజ్(Cash Seize) చేసినట్లు తెలిపారు.

రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దు

పోలీస్ కమిషనర్ బి. అనురాధ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడానికి విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు రూ.50 వేలకు మించి ఎవరు కూడా డబ్బులు వాహనాలలో తీసుకుని వెళ్లవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్(Siddipet Police Commissioner) అనురాధ సూచించారు. ఎక్కువ నగదు తీసుకుని వెళ్తే తప్పకుండా దానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. లేకుంటే డబ్బులను సీజ్ చేస్తామని తెలిపారు. డబ్బులను ఐటీ డిపార్ట్మెంట్ కు అప్పగిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ కమిటీ ద్వారా ఐటీ డిపార్ట్మెంట్ కు అప్పగిస్తామని, బాధితుడు అక్కడికి వెళ్లి అధికారులకు డబ్బులకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపించి రిలీజ్ చేసుకోవచ్చని తెలిపారు.

జహీరాబాద్ మాడ్గి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూ. 3 లక్షల స్వాధీనం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మాడ్గి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలలో భాగంగా ఎటువంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోలాపూర్ నుంచి హైదరాబాద్(Hyderabad) కు తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనుమతులన్ని సువిధ యాప్ లోనే పొందాలి

పార్లమెంటు ఎన్నికల ప్రవర్తన నియమావళి(Election Code) ఈ నెల 16 నుంచి అమలులోకి వచ్చిందని సీపీ తెలిపారు. ఎన్నికల ప్రచారానికి(Election Campaign) సభలకు, సమావేశాలకు, వాహనాల అనుమతులు, బహిరంగ సభలకు అనుమతులన్ని సువిధ యాప్ (Suvidha App)లోనే పొందాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు(Political Parties) సహకరించాలన్నారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడరాదని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో(Polling Centers) ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రచార వివరాలను తెలియజేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించినట్లు సమాచారం ఉంటే ఫొటోలు, వీడియోలను ఈసీఐ కల్పించిన సి-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చులు వివరాలు కోసం కొత్త బ్యాంకు ఖాతాను(Bank Account) తెరవాలని తెలిపారు. బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన జమ, ఉపసంహరణలు, నగదు లావాదేవీలు ఖర్చుల రసీదుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని సహాయ ఎన్నికల పరిశీలకులు షాడో రిజిస్టర్ లో నమోదు చేస్తున్న లెక్కలతో సరిచూసుకోవాలని అన్నారు.

సంబంధిత కథనం