TS Election Code : తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దు- సీఈవో వికాస్ రాజ్-hyderabad ceo vikas raj election code came into force in telangana remove all political flex photos ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Election Code : తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దు- సీఈవో వికాస్ రాజ్

TS Election Code : తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దు- సీఈవో వికాస్ రాజ్

HT Telugu Desk HT Telugu
Mar 17, 2024 08:05 PM IST

TS Election Code : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదు ఎవరు తీసుకోని వెళ్లవద్దని సూచించారు.

తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్
తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్

TS Election Code : కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి(Election Code) అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas Raj) అన్నారు. శనివారం హైదరాబాద్(Hyderabad) నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ రవిగుప్తా, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి లోక్ సభ ఎన్నికల (Lok Sabha Election)ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సమావేశంలో సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని అన్నారు. దేశంలో 7 విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు(Parliament Election) జరుగుతాయని, తెలంగాణలో పోలింగ్ నాలుగో విడతలో మే 13న జరుగుతుందని, కౌంటింగ్(Counting) ప్రక్రియ జూన్ 4న ఉంటుందని అన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏప్రిల్ 18న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్(Election Commission Notification) జారీ అవుతుందన్నారు. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని అన్నారు.

అమల్లోకి ఎన్నికల కోడ్

ఎన్నికల కమిషన్ షెడ్యూల్(Election Commission Schedule) విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి (Election Code) అమలులోకి వస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 24 గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ భవనాలలో వివిధ రాజకీయ పార్టీలకు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, నాయకుల ఫోటోలు , వాల్ రైటింగ్స్ తొలగించాలని ఆదేశించారు. 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద ,72 గంటల్లో ప్రైవేట్ స్థలాలో హోర్డింగులు, ఫ్లెక్సీలు(Flex), ఫొటోలను తొలగించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల వెబ్ సైట్ లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను తొలగించాలని అన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతులు నిబంధనల ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జారీ చేయాలని ఆయన సూచించారు.

నగదు, మద్యం అరికట్టడానికి చర్యలు చేపట్టాలని, జిల్లాలలో అవసరమైన మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనీఖీలు నిర్వహించాలన్నారు. ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదు ఎవరు తీసుకోని వెళ్లవద్దని అన్నారు. నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్నికల రిపోర్ట్ లు ప్రతి రోజూ సమర్పించే విధంగా జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ పేర్కొన్నారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ... ఎన్నికల నియమ నిబంధనలపై(Election Code) అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలన్నారు. సువిధా యాప్(Suvidha App) ద్వారా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిబంధనల ప్రకారం సకాలంలో రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలన్నారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత కథనం