Telangana Elections 2023 : తెలంగాణలో 70.74 పోలింగ్ శాతం నమోదు - గతంతో పోల్చితే తక్కువే - సీఈఓ వికాస్ రాజ్-ec said that 70 74 polling percentage was recorded across telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Elections 2023 : తెలంగాణలో 70.74 పోలింగ్ శాతం నమోదు - గతంతో పోల్చితే తక్కువే - సీఈఓ వికాస్ రాజ్

Telangana Elections 2023 : తెలంగాణలో 70.74 పోలింగ్ శాతం నమోదు - గతంతో పోల్చితే తక్కువే - సీఈఓ వికాస్ రాజ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 01, 2023 02:48 PM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.

తెలంగాణలో పోలింగ్
తెలంగాణలో పోలింగ్

Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. గురువారం రాత్రి 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది.. క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి కచ్చితమైన పోలింగ్ వివరాలు అందడం వల్లే పూర్తి స్థాయి పోలింగ్ శాతం రాలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

గత ఎన్నికలతో పోల్చితే 3 శాతం పోలింగ్ తగ్గినట్లు సీఈవో వికాస్ రాజ్ వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 91.05 పోలింగ్ శాతం నమోదైనట్లు చెప్పారు. యాకత్ పురలో అత్యల్పంగా 36.9 పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించారు

సీఈవో వికాస్ రాజ్ వెల్లడించిన ముఖ్య వివరాలు:

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదు.

రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశం లేదు.

డిసెంబర్ 3వ తేదీన 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.

2018తో పోల్చితే రాష్ట్రంలో 3 శాతం పోలింగ్ తగ్గింది.

అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.05 పోలింగ్ శాతం నమోదు.

యాకత్ పురలో అత్యల్పంగా 36.9 పోలింగ్ శాతం నమోదు.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా లక్షా 80 వేల మంది ఓట్లు వేశారు.

రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్ శాతం నమోదు.

హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్‌ నమోదు.

డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8.00 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు.

ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం.

Whats_app_banner