HYD Online Betting: క్రికెట్‌ బెట్టింగ్‌పై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఏకకాలంలో వేర్వేరు చోట్ల దాడులు-cyberabad polices steel foot on cricket betting attacks at different places simultaneously ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Online Betting: క్రికెట్‌ బెట్టింగ్‌పై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఏకకాలంలో వేర్వేరు చోట్ల దాడులు

HYD Online Betting: క్రికెట్‌ బెట్టింగ్‌పై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఏకకాలంలో వేర్వేరు చోట్ల దాడులు

HT Telugu Desk HT Telugu
Apr 16, 2024 12:20 PM IST

HYD Online Betting: ఐపీఎల్‌ సీజన్‌ను అడ్డంపెట్టుకుని హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో బెట్టింగులు నిర్వహిస్తున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగులపై పోలీసుల ఉక్కుపాదం
హైదరాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగులపై పోలీసుల ఉక్కుపాదం

HYD Online Betting: క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుతున్న Cyberabad సైబరాబాద్ పోలీసులు Police, సోమవారం ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. Online Bettings బెట్టింగులు నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం.....సైబరాబాద్ SOT డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంషాబాద్, మాదాపూర్ ,బాలానగర్,కూకట్ పల్లి, జీడిమెట్ల, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.కూకట్ పల్లికి చెందిన పొందురి సురేష్ ఐపీఎల్ IPL మ్యాచ్ ల పై ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో శంషాబాద్ SOT పోలీసులు దాడి చేశారు.

ఈ సందర్బంగా సురేష్ తో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన రామకృష్ణ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ బెట్టింగ్ ముఠాలో ఒకరుగా ఉన్న రామాంజనేయులు అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు.

ప్రధాన బెట్టింగ్ నిర్వాహకుడు రామాంజనేయులు 350 మంది పంటర్ల ద్వారా రూ 4.5 కోట్ల బెట్టింగ్ లు స్వీకరించినట్టు పోలిసులు గుర్తించారు.నిందితుల నుంచి రూ.30,07,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.రెండు బ్యాంకుల్లో రూ.49,92,539 సీజ్ చేశారు.ఇటితో పాటు నాలుగు స్మార్ట్ ఫోన్ లు,ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు

మాలంపేట లో.....

దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట లో చిన్న బాబు,చిన్నాంషెట్టి కరిముల్ల, పనమటి వెంకటేష్, దింద రమేష్ అనే వ్యక్తులు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శంషాబాద్ పోలిసులు దాడులు చేశారు.ఈ దాడిలో రూ 1.19 లక్షలు,రూ 2,400 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గోకుల్ ప్లాట్స్....

గోకుల్ ప్లాట్స్ లోని ఎస్ఆర్ఎస్ డైమండ్ అపార్ట్మెంట్ లో దాడులు నిర్వహించిన మాదాపూర్ పోలీసులు కందుకూరు వీర శంకర్ చారి,భూమిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి, వంశీకృష్ణ లను అరెస్ట్ చేశారు.ప్రధాన బెట్టింగ్ నిర్వాహకుడు బెంగళూరుకు చెందిన రాజేష్ రెడ్డి,గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి,అనంత పూర్ కు చెందిన నాగరాజున్న రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.87 వేల నగదు,బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ 1.44 కోట్లు సీజ్ చేశారు.

జీడిమెట్లలో....

జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో SOT బాలానగర్ పోలిసులు గుంటూరుకు చెందిన ఎర్రమంచు అజయ్, వైజాగ్ కు చెందిన మహేష్ కుమార్ లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ 73 వేల నగదు, యూపిఐ ద్వారా సేకరించిన రూ 21 వేల నగదు,రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

బాచుపల్లిలో…

బాచుపల్లి పీఎస్ పరిధిలోని బాలానగర్ పోలిసులు మోర్తల శ్రీకాంత్ రెడ్డి, అలీ లోకేష్,సునీల్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ 13.30 లక్షలను సీజ్ చేశారు. దీంతో పాటు 16 మొబైల్ కి ప్యాడ్ లు,మూడు లాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

నితీష్,బుడ్డా రెడ్డి అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే 9490617444 నంబర్లకు సమాచారం అందించాలని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సూచించారు.

(రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాద్ జిల్లా)

IPL_Entry_Point

సంబంధిత కథనం