CM Revanth Reddy Notices : అమిత్ షా ఫేక్ వీడియో కేసు, సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు
CM Revanth Reddy Notices : సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

CM Revanth Reddy Notices : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దిల్లీ పోలీసులు(Delhi Police) నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో(Amit Shah Fake Video) కేసులో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలకు(Congress) పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా (Amit Shah)ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్(Viral) అయ్యింది. ఈ వీడియోను షేర్ చేసిన పలువురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఫేక్ వీడియో
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో(Amit Shah Deep Fake Video)ను ఇటీవల కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఈ కేసులో మే 1న విచారణకు హాజరు కావాలని దిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి(Cm Revanth Reddy) నోటీసులు జారీ చేసింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని ఇటీవల అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను వైరల్ అయ్యింది. ఈ ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేసినందుకు పోలీసులు సమన్లు ఇచ్చారు. అసలు ఈ ఫేక్ వీడియో ఎవరు రూపొందించారనే దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ(PM Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అమిత్ షా ఏమన్నారంటే?
తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. కాంగ్రెస్ నేతలతో పాటు తెలంగాణ డీజీపీ, సీఎస్ లకు కూడా నోటీసులు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్(Congress Twitter) లో ఆ వీడియో పోస్ట్ చేయడంతో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు ఇచ్చారు. అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి వైరల్ చేశారని తెలంగాణ బీజేపీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా(Amit Shah) మాట్లాడిన వీడియోను కొందరు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా అన్నారు. రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు ఆ హక్కులు తిరిగి ఇస్తామన్నారు. ఆ వీడియోను ఎడిట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను(Reseravations) రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లు వీడియో వైరల్ చేశారు.
సంబంధిత కథనం