Police Case On Amit Shah : హైదరాబాద్లో అమిత్ షాపై కేసు నమోదు - FIRలో మాధవి లత, రాజాసింగ్ పేర్లు-case registered against amit shah for violating model code of conduct during roadshow in hyderabad ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Police Case On Amit Shah : హైదరాబాద్లో అమిత్ షాపై కేసు నమోదు - Firలో మాధవి లత, రాజాసింగ్ పేర్లు

Police Case On Amit Shah : హైదరాబాద్లో అమిత్ షాపై కేసు నమోదు - FIRలో మాధవి లత, రాజాసింగ్ పేర్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 03, 2024 09:49 PM IST

Police Case On Amit Shah in Hyderabad : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అందిన ఫిర్యాదు మేరకు అమిత్ షాతో పాటు తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ రోడ్ షాలో అమిత్ షా
హైదరాబాద్ రోడ్ షాలో అమిత్ షా (Photo Source @TheNaveena Twitter)

Case Registered Against Amit Shah : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీ పరిధిలోని మొఘల్ పురా పోలీసు స్టేషన్ (moghalpura police station)లో ఆయనపై కేసు నమోదైంది.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా(Amith Sha) మే 1వ తేదీన హైదరాాబాద్ పార్లమెంట్ పరిధిలో తలపెట్టిన రోఢ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ నేత, పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఈసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

వీరి ప్రచారంలో చిన్నారులు ఉన్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవి లత(Madhavai Latha) మాట్లాడే సమయంలో కొంత మంది మైనర్ బాలికలు వేదికపైకి వచ్చారని తెలిపారు. చిన్నారుల చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని ప్రస్తావించారు. దీనిపై ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉందని ఫిర్యాదు ఇచ్చారు.

ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నారులతో ప్రచారం చేయించారని తెలిపారు. ఈ తరహా ప్రచారం ఎన్నికల కోడ్ కు విరుద్ధమన్నారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం… సంఘటన పై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని(Hyderabad CP) ఆదేశించింది. సీపీ ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారా రంగంలోకి దిగి విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. మొఘల్ పురా పోలీసులు(moghalpura police station) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఏ1 గా యమాన్ సింగ్, ఏ2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, ఏ3 గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏ4గా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఏ5 గా బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఉన్నారు.

సంబంధిత కథనం