తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Revanth On Tesla: టెస్లా తెలంగాణకు రావాల్సింది కానీ,గుజరాత్‌ కోసం ఒత్తిడి చేశారన్న సిఎం రేవంత్‌ రెడ్డి

Revanth On Tesla: టెస్లా తెలంగాణకు రావాల్సింది కానీ,గుజరాత్‌ కోసం ఒత్తిడి చేశారన్న సిఎం రేవంత్‌ రెడ్డి

Sarath chandra.B HT Telugu

09 May 2024, 5:46 IST

    • Revanth On Tesla: ఎలన్‌ మస్క్‌ సారథ్యంలోని టెస్లా ఈవీ కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందని, అయితే కేంద్రంలోని పెద్దలు గుజరాత్‌ కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 
తెలంగాణకు టెస్లాను రానివ్వకుండా అడ్డుకున్నారన్న రేవంత్ రెడ్డి
తెలంగాణకు టెస్లాను రానివ్వకుండా అడ్డుకున్నారన్న రేవంత్ రెడ్డి

తెలంగాణకు టెస్లాను రానివ్వకుండా అడ్డుకున్నారన్న రేవంత్ రెడ్డి

Revanth On Tesla: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ పెద్దలపై తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎప్పటి నుంచో భారత్‌లో అడుగు పెట్టాలని భావిస్తున్న టెస్లా కంపెనీ గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం కావాల్సి ఉన్నా దానిని రాష్ట్రానికి రానివ్వకుండా బీజేపీ పెద్దలు ఒత్తిడి చేశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటోందని, అయితే ఆ కంపెనీని గుజరాత్‌కు మారాలని బీజేపీ ఒత్తిడి తెచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ నాయకుడు ఫాక్స్‌కాన్, టెస్లాలను విడిచిపెట్టమని ఒత్తిడి తెచ్చారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

"తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా? టెస్లా కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని భావించిందని, విదేశీ పెట్టుబడుల విషయంలో ఎలా కమ్యూనికేట్ చేయాలో మాకు కూడా తెలుసని, తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను" రేవంత్‌ రెడ్డి అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్‌ రెడ్డి.. నరేంద్ర మోదీ మరియు అమిత్ షాలు గుజరాత్ మాత్రమే భారతదేశమని అనుకుంటున్నారన్నారు. అది అలా కుదరదని దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయని వారికి కూడా హక్కులు ఉన్నాయని స్పస్టం చేశారు.

టెస్లా భారతదేశంలో తన కర్మాగారాన్ని స్థాపించడానికి స్థలం కోసం వెతుకుతున్నట్లు పలు నివేదికలు వెలువడ్డాయి. కొద్ది వారాల క్రితం భారత్‌లో ఎలన్‌ మస్క్‌ పర్యటించాల్సి ఉన్నా చివరి నిమిషంలో అది రద్దైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మస్క్ పర్యటనను రాజకీయంగా వాడుకోడానికి బీజేపీ ప్రయత్నించిందని విపక్షాలు ఆరోపించాయి. రాజకీయ వాతావరణం, విమర్శలు, ఇతర కారణాలతో మస్క్‌ భారత పర్యటన రద్దు చేసుకున్నారు.

మరోవైపు దేశంలో టెస్లా అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్నా, ఆ సంస్థ కోరుకున్న నిబంధనల సడలింపు విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు టెస్లా భారత్‌లో ప్లాంట్‌ను స్థాపించడానికి భూమిని కేటాయించడానికి ఆఫర్లు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో సిఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన రెడ్డి, తెలంగాణకు చెందిన ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఏమిటని ప్రశ్నించారు.

"తెలుగు మాట్లాడే ఎంపీలు 42 మంది ఉంటే వారిలో కేబినెట్ మంత్రి ఒక్కరే ఉన్నారని గుజరాత్‌లో 26 మంది ఎంపీలు ఉంటే ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నారని, ఉత్తరప్రదేశ్‌‌కు 12 మంది మంత్రులను ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు.

అమిత్ షా, నరేంద్ర మోదీల దృష్టిలో దక్షిణ భారత ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడ్రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ రేవంత్‌, రాహుల్‌ గాంధీలపై తీవ్ర విమర్శలు చేశారు. ట్రిపుల్ ఆర్‌ కలెక్షన్ల కంటే డబుల్ ఆర్‌ కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే రేవంత్‌ ఎదురుదాడి చేసినట్టు కనిపిస్తోంది.

తదుపరి వ్యాసం