తెలుగు న్యూస్ / ఫోటో /
PM Modi Road Show : విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో, తరలివచ్చిన అశేష ప్రజానీకం
- PM Modi Road Show : ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కలిసి మోదీ బుధవారం సాయంత్రం విజయవాడ రోడ్ షో నిర్వహించారు.
- PM Modi Road Show : ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కలిసి మోదీ బుధవారం సాయంత్రం విజయవాడ రోడ్ షో నిర్వహించారు.
(1 / 7)
ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కలిసి మోదీ బుధవారం సాయంత్రం విజయవాడ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి కూటమికి మద్దతుగా నినాదాలు చేశారు.
(2 / 7)
ఈ రోడ్ షో పై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి మరపురాని రోడ్‌షో పాల్గొన్నానని ప్రధాని మోదీ అన్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ అంతటా పర్యటించిన తర్వాత, ప్రజలు పెద్ద సంఖ్యలో ఎన్డీఏకి ఓటు వేస్తున్నారని నేను నమ్ముతున్నానన్నారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతు తమకు ఉందన్నారు.
(3 / 7)
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మా ప్రాధాన్యత, తదుపరి తరానికి మౌలిక సదుపాయాల అందించాల్సిన బాధ్యత మాపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. రోడ్ల నెట్‌వర్క్, రైల్వే నెట్‌వర్క్, ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి చాలా చేయాల్సి ఉందన్నారు. బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను కూడా నిర్మించాలనుకుంటున్నామన్నారు.
(4 / 7)
ఏపీలో గతంలో బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేశామని ప్రధాని మోదీ అన్నారు. మాది బలమైన కూటమి, భవిష్యత్తు అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ క్రియాశీల భాగస్వామ్యాన్ని జనసేన పార్టీ మరింత బలోపేతం చేసిందన్నారు. ఈ కూటమికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల సత్తా ఉందన్నారు.
(5 / 7)
రాష్ట్ర ప్రగతికి ఏపీ తీరప్రాంతాన్ని ఎన్డీఏ కూటమి ఉపయోగించుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో పోర్టుల ఆధారితంగా అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామన్నారు. అదే సమయంలో మత్స్య రంగానికి గొప్ప ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
(6 / 7)
వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచాలని, పారిశ్రామిక వృద్ధిని పెంచాలని, సేవల రంగంలో కూడా ఏపీ ఒక ముద్ర వేయాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ ప్రజల ఆశీర్వాదంతో వ్యవస్థాపక శక్తికి రెక్కలు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు.
ఇతర గ్యాలరీలు