తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Elections 2023 : మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..

Elections 2023 : మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..

Sharath Chitturi HT Telugu

17 November 2023, 7:05 IST

google News
  • Elections 2023 news : మధ్యప్రదేశ్​తో పాటు ఛత్తీస్​గఢ్​లోని కొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోరాటం నడుస్తోంది!

మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..
మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..

మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..

Elections 2023 news : మరో హైఓల్టేజ్​ ఘట్టానికి దేశం సన్నద్ధమైంది. మధ్యప్రదేశ్​తో పాటు ఛత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో.. బీజేపీ- కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న రాజకీయ విశ్లేషకుల అంచనాల మధ్య.. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు..

మధ్యప్రదేశ్​లో మొత్తం 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. కాగా.. బైహర్​, లంజి, పర్స్​వారా అసెంబ్లీ సీట్లతో పాటు మాండ్లా, దిండోరి జిల్లాల్లోని బూత్​లలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్​ ప్రక్రియ ముగియనుంది.

Madhya Pradesh elections 2023 live updates : పోలింగ్​ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల సంఘం. మాక్​ డ్రిల్స్​ని సైతం నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు.. రాష్ట్రంలో భద్రతను కూడా పెంచారు అధికారులు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

ఈ దఫా ఎన్నికల్లో.. 230 సీట్ల కోసం 2,533 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 5.60కోట్లకుపైగా మంది ఓటర్లు.. వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికలు 2023..

ఛత్తీస్​గఢ్​లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. 20సీట్లకు.. ఈ నెల 7న పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. కాగా.. మిగిలిన 70 సీట్లకు నేడు పోలింగ్​ జరగనుంది. నక్సల్స్​ ప్రభావిత బిద్రానవాగడ్​, రాజిమ్​ జిల్లాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్​ కొనసాగనుంది. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు ఓటింగ్​ ప్రక్రియ మొదలవుతుంది.

Chhattisgarh elections 2023 live updates : నక్సల్స్​ ప్రభావం అధికంగా ఉన్న 20 సీట్లల్లో తొలి దశ పోలింగ్​ ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండో దశ పోలింగ్​కి కూడా అదే స్థాయిలో చర్యలు చేపట్టారు. భద్రతాదళాలను భారీ సంఖ్యలో మోహరించారు.

బీజేపీ వర్సెస్​ కాంగ్రెస్​..

ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్​ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్​లో బీజేపీ అధికారంలో ఉండగా.. ఛత్తీస్​గఢ్​ను కాంగ్రెస్​ పాలిస్తోంది. సొంత రాష్ట్రాల్లో తిరిగి అధికారం చేపట్టి, మరో రాష్ట్రాన్ని కూడా ఛేజిక్కించుకోవాలని ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాహుబలి అభ్యర్థులతో పాటు కచ్చితంగా గెలుస్తారనుకున్న వారికే టికెట్లు ఇచ్చాయి.

Madhya Pradesh elections 2023 : మధ్యప్రదేశ్​లో.. గడిచిన 20ఏళ్లల్లో, 18ఏళ్లలు బీజేపీ అధికారంలో ఉంది 2018 ఎన్నికల తర్వాత.. 18 నెలల పాటు కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. ఈసారి ఎలాగైనా మెజారిటీతో గెలవాలని కాంగ్రెస్​ చూస్తోంది.

ఇక ఛత్తీస్​గఢ్​లో 2003 నుంచి 2018 వరకు బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించి, బీజేపీకి షాక్​ ఇచ్చింది. మరి ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు? అన్న ప్రశ్నలపై ఉత్కంఠ నెలకొంది.

మిజోరంలో ఎన్నికలు ముగిశాయి. మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో ఎన్నికల సమరం నేటితో ముగియనుంది. రాజస్థాన్​, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత.. 5 రాష్ట్రాల ఫలితాలు.. డిసెంబర్​ 3న వెలువడనున్నాయి.

తదుపరి వ్యాసం