Srikakulam Election Fight: శ్రీకాకుళం చిత్రాలు.. అసెంబ్లీ ఎన్నికల బరిలో ధర్మాన వర్సెస్ గొండు శంకర్
26 April 2024, 10:04 IST
- Srikakulam Election Fight: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గంలో సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావుతో టీడీపీ తరపున గొండు శంకర్ తలపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన ఆరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
శ్రీకాకుళంలో ధర్మాన వర్సెస్ గొండు శంకర్
Srikakulam Election Fight: శ్రీకాకుళం జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు Dharmana prasada rao ఆరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీకాకుళం Srikakulam రాజకీయాల్లో గట్టి పట్టున్న ధర్మాన ఈసారి కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. TDP తరపున గొండు శంకర్ Gondu Shankar పోటీ చేస్తున్నారు
గత ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళం నియోజక వర్గానికి వైసీపీ అధినేత పలు హామీలు ఇచ్చారు. వాటిలో కోడి రామ్మూర్తి స్టేడియం మరమ్మతులకు రూ.10 కోట్లు కేటాయిస్తానని చెప్పారు. స్టేడియం అభివృద్ధికి 2016లో టీడీపీ ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రూ.ఏడు కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టరుకు రూ.4 కోట్ల బిల్లుల చెల్లించక పోవడంతో మూడేళ్లుగా పనులు నిలిచిపోయాయి. జిల్లాకొచ్చిన జగన్ పనుల పూర్తి చేయడానికి అద నంగా రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ హామీ ప్రతిపాదనల దశలోనే ఉంది తప్ప నిధులు మాత్రం మంజూరు కాలేదు.
రోడ్డు విస్తరణ పనులు..
- శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డును నాలుగు వరుసలుగా మార్చేందుకు మరో రూ.18 కోట్లు కేటాయిస్తామన్నారు. సీఎం ప్రకటన తర్వాత హడావుడిగా ప్రారంభించిన రహదారి పనులు మధ్యలోనే పడకే శాయి. ఆమదాలవలస వైపు చేపట్టిన విస్తరణ అస్తవ్యస్తంగా మారింది. వాహనం నడపాలంటే భయపడా ల్సిన దుస్థితి నెలకొంది. శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి నుంచి జాతీయ రహదారి వరకు ఎన్ని అడుగుల విస్తరణ చేయాలో కొలిక్కి రాలేదు. పనుల్లో పురోగతి లేదు.
- శ్రీకాకుళం పట్టణంలో కోడి రామ్మూర్తి మైదానం నిర్మాణానికి చర్యలు చేపడతాం. పూర్తిస్థాయిలో వసతులు సమకూరుస్తామని చెప్పారు.అయిదేళ్ల కిందట ఏ దుస్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఏ మాత్రం మార్పు జరగలేదు. అక్కడ నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం, ఇతర వసతుల భవనం కూడా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలిక అభివృద్ధి చర్యలు చేపట్టి జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే మైదానం అంతా బురదమయం అవుతోంది.
- శ్రీకాకుళం ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యో గాలు ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లు అయినా మళ్లీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పరిశ్రమల్లో స్థానికులకు 75 ఉద్యోగాలు కల్పిస్తామన్నా, పరిస్థితి ఎప్పటిలాగే ఉంది.
ఎమ్మెల్యేగా ధర్మాన హామీలు:
- వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరందిస్తామని, శివారు రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నా నేటికీ పరిస్థితిలో మార్పు లేదు. శివారు భూములకు సాగు నీరందే పరిస్థితి లేదు. కాలువలు ఆధునికీకరణ మాటే మరిచారు. నిర్వహణకు రూపాయి విదిల్చలేదు.
- శ్రీకాకుళం నగరాభివృద్ధిలో భాగంగా రింగు రోడ్డు నిర్మాణం చేపడతామన్నా, సర్వే గానీ, భూసేకరణ గానీ జరగలేదు. ప్రతిపాదనల దశలోనే అటకెక్కింది.
- అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంద్రపుష్కరిణిని ఆధునికీకరిస్తామన్న హామీ నెరవేరలేదు.గత ఎన్నికల ముందు ఎలా ఉందో ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది. మాస్టర్ ప్లాన్ రూపొందించినా పనులు ప్రారంభం కాలేదు.
- శ్రీకాకుళం నగర ప్రజలకు 24 గంటలు తాగునీరందిస్తాం. కంపోస్టు కాలనీలో కుళాయిలు వేయిస్తామన్న హామీలు నెరవేరలేదు.
- ఖైరి ఓపెన్ హెడ్ ఛానల్ పునరుద్ధరించి శివారు ఆయకట్ట వరకు సాగునీరందిస్తామన్న హామీ నెరవేరలేదు.
ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు:
- శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మ నోహర్ నాయుడు వర్జిన్ రాక్ గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. నియోజకవర్గంలో కుమారుడి హవా కొనసాగేలా చూస్తున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల్లో అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని ఇసుక సరఫరా తొలుత ధర్మాన తనయుడు రామమనోహర్నాయుడు కనుసన్నలోనే నడిచింది. తర్వాత ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకోగానే, ర్యాంపుల నిర్వహణ కాంట్రాక్టుల్నివీరికి అనూకూలమైన వారికే కేటాయింపులు చేశారు. పేరుకే జేపీ గ్రూపు సిబ్బంది ఉన్నా ప్రస్తుతం ర్యాంపును నిర్వ హిస్తున్న వారంతా మంత్రి అనుచరులేననే ఆరోపణలు ఉన్నాయి.
- తండ్యాంవలస సమీపంలోని సావిత్రిపురం పేరుతో వేసిన 67 ఎకరాల్లో లేఅవుట్‌లో ప్రభుత్వ భూమి 20 నుంచి 23 ఎకరాల వరకు ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
- జగనన్న కాలనీ లే అవుట్లు వేసినపుడు, శ్రీకాకుళం మండల పరిధిలోని పాత్రునివలసలో ప్రభుత్వ భూమిని కొంత మంది రైతుల పేరున రాయించి వాటిని ప్రభుత్వానికి విక్రయించారనే ఆరోపనలు ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచి రైతుల వద్ద కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అనుచరులుగా ఉన్న పలువురిపై ఆరోపణలు ఉన్నా చూసి చూడనట్టు వ్యవహరించారనే ప్రచారం ఉంది.
- గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుండా లక్ష్మీదేవిపై ధర్మాన ప్రసాదరావు 5777 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈసారి కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పైడి నాగభూషణరావు పోటీ చేస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నగొండు శంకర్‌కు ధర్మానకు మధ్య ప్రధానంగా పోటీ ఉంది.