Dharmana Comments: శ్రీకాకుళంలో కడప రెడ్లు… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు-kadapa reddys in srikakulam minister dharmanas sensational comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kadapa Reddys In Srikakulam... Minister Dharmana's Sensational Comments

Dharmana Comments: శ్రీకాకుళంలో కడప రెడ్లు… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Sarath chandra.B HT Telugu
Feb 27, 2024 11:53 AM IST

Dharmana Comments: సార్వత్రిక ఎన్నికలకు ముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. శ్రీకాకుళం జిల్లాలో కడప రెడ్ల ఆగడాలపై మంత్రి ఆరోపణలు ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి.

మంత్రి ధర్మాన ప్రసాదరావు
మంత్రి ధర్మాన ప్రసాదరావు

Dharmana Comments: శ్రీకాకుళం జిల్లాలో కడప Kadapa నుంచి వచ్చిన వారు భూదందాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు Dharmana చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ కలకలం రేపుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ విజయావకాశాలను ఈ తరహా ప్రచారాలు దెబ్బతీశాయి.

ట్రెండింగ్ వార్తలు

విశాఖ ఎంపీగా Visakha MP 2014లో జగన్ తల్లి విజయమ్మ పోటీ చేసిన సమయంలో రాజకీయ ప్రత్యర్థులు ఏ ప్రచారాలనైతే తెరపైకి తెచ్చారో అలాంటి వ్యాఖ్యలే వైసీపీ మంత్రి ధర్మాన బహిరంగం చేయడం చర్చనీయాంశం అయ్యాయి. కడప రెడ్లు Kadapa Redlu కబ్జాలకు పాల్పడుతున్నారంటూ నేరుగా విమర్శించడంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్టైంది.

కడ జిల్లాకు చెందిన ఎవరో సుబ్బారెడ్డి Subbareddy వచ్చి భూమి తీసుకుంటానంటే పొమ్మని చెప్పానని ఇలాగే వదిలేస్తే శ్రీకాకుళం జిల్లా రౌడీల పాలవుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాకుళంలో కడప రెడ్లు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోనంటూ రెవెన్యూశాఖ మంత్రి Minister Dharmana ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కళింగ కోమటి సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి.

'రాజకీయాల్లో తాను నిజాయతీపరుడిగా ఉన్నానని, ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని ధర్మాన సూచించారు.

ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడకూడదని, ప్రజాప్రతినిధిగా జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి ఈ భూమి తీసుకుంటాం.. ఏదేదో చేసేస్తాం అన్నాడని, నిన్ను ఎవడు ఇక్కడికి రమ్మన్నాడని నిలదీశానని, శ్రీకాకుళం నీ అబ్బగాడి సొత్తు అనుకున్నావా.. తంతాను పొమ్మని చెప్పానని పేర్కొన్నారు. కడప నుంచి ఇక్కడికి వచ్చి అజమాయిషీ చెలాయించవచ్చని అతను అనుకుంటున్నాడని, దాన్ని తాను అవమానంగా భావిస్తానని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇతర జిల్లాల వారి పెత్తనమేంటని ప్రశ్నించారు? వారు తమ పార్టీనా.. పక్క పార్టీనా అని కూడా చూడనని, సుబ్బారెడ్డి చెప్పిన దానికి నేను సరే అని వదిలేస్తే జిల్లా రౌడీల పాలవుతుందని, రౌడీల వద్దకు ఎవరో వెళ్లరని జిల్లాకు చెందిన వారే.. ఒకడ్ని మరొకడు దోచుకోవడానికి రౌడీలను ఆశ్రయిస్తారని చెప్పారు. అలా చేయొద్దని హితవు పలికారు.

ఇక్కడకొచ్చే రౌడీలకంటే పెద్ద రౌడీ ఇంకెవడో ఉంటాడని ఆ పెద్ద రౌడీకి అసలు బాసు ఒకడు ఉంటాడని ఈ వ్యవస్థ మొత్తం అలా రౌడీల చేతుల్లోకి వెళ్లిపోతుందని, బాధ్యత లేకుండా వచ్చేవారు ఆ వేళ పైసో పరకో కోసం ఏదో పని చేస్తే అది తప్పుడు దారిలోకి వెళ్లిపోతుందని ఆలోచించాలని ధర్మాన పేర్కొన్నారు.

ధర్మాన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినా ఎన్నికల వేళ వైసీపీని ఆత్మ రక్షణలో పడేశాయి. ఇప్పటికే విశాఖ, ఉత్తరాంధ్రల్లో కడప జిల్లాకు చెందిన వారి భూ కబ్జాలు ఎక్కువయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన భూములన్నింటిని స్వాధీనం చేసుకున్నారని ప్రతిసారీ ఆరోపిస్తోంది.

విపక్షాలకు ఆరోపణలకు ఊతం ఇచ్చేలా అధికార పార్టీ మంత్రి స్వయంగా అవే తరహా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ధర్మాన వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటనే చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

WhatsApp channel