ఏపీ ఇంధన శాఖలో తాత్కాలిక ఉద్యోగుల పెత్తనం సాగుతోంది. లక్షల కోట్ల ఖరీదైన ప్రాజెక్టుల బాధ్యతల్ని అనుభవం లేని వారికి, కన్సల్టెంట్లకు అప్పచెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లో జరుగుతున్న నియామకాలు, విధుల కేటాయింపులో మతలబు ఏమిటనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.