తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tollywood Supports Pawan : పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ హీరోల మద్దతు, వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు

Tollywood Supports Pawan : పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ హీరోల మద్దతు, వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు

07 May 2024, 19:36 IST

    • Tollywood Supports Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ మద్దతు పెరుగుతోంది. పిఠాపురం బరిలో నిలిచిన పవన్ గెలుపు కోసం జబర్దస్త్ కమెడియన్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు పవన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ హీరోల మద్దతు
పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ హీరోల మద్దతు

పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ హీరోల మద్దతు

Tollywood Supports Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రోజు రోజుకీ టాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది. హీరోలు, ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఒక్కొక్కరిగా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తన సోదురుడు పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే తన సోదరుడు, జనసేన నేత నాగేంద్రబాబు కుటుంబం మొత్తం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. నాగేంద్రబాబు సతీమణి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, జబర్దస్త్ కమెడియన్లు పిఠాపురంలో గల్లీ గల్లీ తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, పృథ్వీ, నిర్మాత నాగవంశీ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

రంగంలోకి మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో గెలిపించాలని ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. న్యాచురల్ స్టార్ నాని కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పోస్టు పెట్టారు. 'మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని, మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సర్' అని హీరో నాని పోస్టు పెట్టారు. తన తండ్రి చిరంజీవి వీడియోను షేర్ చేస్తూ... మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కల్యాణ్ ను గెలిపించండని హీరో రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మరికొంతమంది టాలీవుడ్ హీరోలు కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పోస్టులు పెట్టారు. హనుమాన్ హీరో తేజ సజ్జా, రాజ్ తరుణ్, సంపూర్ణేష్ బాబు పవన్ కల్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

హీరోల మద్దతు

హనుమాన్ హీరో తేజ సజ్జా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీ పెట్టారు. 'త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది.. పవన్ సర్ మమ్మల్ని గర్వపడేలా చేయండి' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఏపీ పట్ల మీకున్న విజన్, కష్టపడుతున్న తీరును ముందు నుంచీ గమనిస్తూనే ఉన్నానని హీరో రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కోట్లాది మంది ప్రజలు ఆశిస్తున్నట్లుగా నేను కూడా ఎంతో ఆశతో ఉన్నాను. మీరు ఉజ్వల భవిష్యత్ ను అందిస్తారని, మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు జనంకి నువ్వు కావాలి అంటూ జనసేన, పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశాడు హీరో రాజ్ తరుణ్ పోస్టు పెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా .. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్ఫూర్తి, రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని సంపూర్ణేష్ బాబు పోస్టు పెట్టారు. టాలీవుడ్ హీరోలు వరుసగా పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటిస్తున్నారు. వీరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తదుపరి వ్యాసం