Mudragada on Pawan : పిఠాపురంలో పవన్ ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా- ముద్రగడ-kakinada mudragada padmanabham challenged to change name of pawan kalyan not defeated at pithapuram ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mudragada On Pawan : పిఠాపురంలో పవన్ ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా- ముద్రగడ

Mudragada on Pawan : పిఠాపురంలో పవన్ ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా- ముద్రగడ

Bandaru Satyaprasad HT Telugu
Apr 30, 2024 02:15 PM IST

Mudragada on Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్, చిరంజీవిపై వైసీపీ నేత ముద్రగడ ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు.

ముద్రగడ పద్మనాభం
ముద్రగడ పద్మనాభం

Mudragada on Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో(Pithapuram) పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు. కాకినాడి జిల్లా కిర్లంపూడిలో మంగళవారం ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్(Hyderabad) నుంచి పిఠాపురం పారిపోయి వచ్చారని పవన్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదన్నారు. పవన్ కల్యాణ్ కు విషయంపై అవగాహన లేకుండా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని రైలు దహనం ఘటనకు చంద్రబాబే కారణమన్నారు. ఈ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు. తనను తీహార్ జైలు(Tihar Jail)కి పంపించాలని హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేశారని, అదంతా చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు.

పవన్ పార్టీ ప్యాకప్

పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ముద్రగడ (Mudragada)మండిపడ్డారు. ఏదైనా పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా తాను సమాధానం చెప్తానన్నారు. రంగువేసుకునే వాళ్లను ప్రజలను నమ్మరని, వారికి ఓట్లు వేయరన్నారు. పవన్(Pawan Kalyan) పార్టీ తొందరలోనే ప్యాకప్ చెప్తుతుందని జోస్యం చెప్పారు. పవన్ కు తోటి వారిని గౌరవిడంచడం రాదన్నారు. పవన్ సినిమాల్లో నటించాలని కానీ, రాజకీయాల్లో కాదన్నారు. పవన్ కల్యాణ్ కు డబ్బే ప్రధానం అన్నారు. రైతులకు సాయం పేరుతో తీసుకున్న చందాల్లో ఎంత మేర ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా ఆదాయం కంటే రాజకీయాల్లో ఆదాయమే పవన్ కు బాగుందన్నారు. నేను చవటను, దద్దమ్మను అయితే కాపులు కోసం పవన్ ఎందుకు రోడ్డుపైకి రాలేదని ప్రశ్నించారు. పవన్ తనపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవి మద్దతిచ్చినా ప్రయోజనంలేదు

వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్(Pawan Kalyan) కు ఏ హక్కు ఉందని ముద్రగడ(Mudragada Padmanabham) ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి పవన్ కల్యాణ్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. పవన్ అడ్రెస్ ఏంటి? ఎక్కడ పుట్టారని అని ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని ఎద్దేవా చేశారు. పిఠాపురం(Pithapuram) ప్రజలు పవన్ ను తన్ని తరిమేస్తారని ముద్రగడ ఫైర్ అయ్యారు. ఉప్మా, కాఫీ అని తనను అవమానిస్తున్నారని, గౌరవించడం తన అలవాటన్నారు. అలా మాట్లాడడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. సినిమా వాళ్లు ఎప్పుడూ ప్రజలను ఆదుకోరని ఆరోపించారు. పవన్ తన ఇంట్లో కనీసం ఎవరికైనా కనీసం కాపీ ఇచ్చారా? అని నిలదీశారు. చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వస్తే గౌరవిస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు గురించి చిరంజీవి ఎందుకు మాట్లాడడంలేదన్నారు. అప్పుడు మాట్లాడని చిరంజీవి(Chiranjeevi).. ఇప్పుడు ఏదో వీడియోలు రిలీజ్ చేస్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. 1978లో ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్థోమత లేని చంద్రబాబుకు ఇవాళ ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

Whats_app_banner

సంబంధిత కథనం