తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Kapu Leaders: పవన్ వ్యవహారంలో నొప్పించకుండా తప్పించుకున్న వైసీపీ కాపు నేతలెవరు?

Ysrcp Kapu Leaders: పవన్ వ్యవహారంలో నొప్పించకుండా తప్పించుకున్న వైసీపీ కాపు నేతలెవరు?

Sarath chandra.B HT Telugu

07 May 2024, 12:55 IST

    • Ysrcp Kapu Leaders: పవన్‌ కళ్యాణ‌్ వ్యవహారంలో వైసీపీ కాపు నేతల్లో చాలామంది ఆచితూచి వ్యవహరించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో నష్టం తప్ప తమకేమి ప్రయోజనం ఉండదనే క్లారిటీ వైసీపీ కాపు నేతల్లో ఉంది. 
పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలకు పరోక్షంగా కారణమైన వైసీపీ
పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలకు పరోక్షంగా కారణమైన వైసీపీ

పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలకు పరోక్షంగా కారణమైన వైసీపీ

Ysrcp Kapu Leaders: పవన్‌ కళ్యాణ్‌‌ను విమర్శించే వ్యవహారంలో చాలామంది కాపు నేతలు నొప్పించకుండా తప్పించుకున్నారు. కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, ఆళ్ల నాని, గ్రంథి శ్రీనివాస్, వంగా గీత వంటి వారు దీనికి ఉదాహరణగా కనిపిస్తారు. ఎప్పుడైనా విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్‌‌ను కించపరిచే భాషలో వ్యక్తిగత విమర్శలకు చోటివ్వలేదు. కానీ పేర్నినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌ వంటి వారు తాము పవన్ కళ్యాణ్ కి నష్టం చేస్తన్నామన్న భ్రమలో వైయస్సార్సీపీకి మొత్తంగా కాపుల్ని దూరం చేశారనే వాదన కూడా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

మొదట్లో వైసీపీ విచిత్రమైన స్ట్రాటజీ ఒకటి అమలు చేసిందని ఏపీ రాజకీయాలను గమనిస్తున్న వారు గుర్తు చేసుకుంటారు. ఎన్టీఆర్ ని దేవుడంటూ చంద్రబాబును తిట్టడం, చిరంజీవిని గొప్పోడని పొగుడుతూ పవన్ కళ్యాణ్ ను తిట్టడం దాని ద్వారా ఆ కులాల్లోని తమ ఓట్లను కాపాడుకోవచ్చని వైసీపీ భావించిందని చెబుతారు.

ఫలించని వ్యూహ‍ం…

పవన్ కళ్యాణ్‌ని తరచూ తిట్టే అంబటి, పేర్ని, గుడివాడ కూడా చిరంజీవిని పల్లెత్తు మాట అనేవారు కాదు. కానీ ఆ వ్యూహం కూడా ఫలించ లేదనిపించి స్వయంగా జగన్మోహన రెడ్డి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి తరచూ మాట్లాడడం కేవలం కాపులే కాకుండా, ఇతర వర్గాల వారికి కూడా పెద్దగా రుచించలేదు.

పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఏ విధానపరమైన, పాలనా పరమైన ప్రశ్నకూ జవాబివ్వని జగన్మోహన్‌ రెడ్డి అన్నిటికీ నాలుగు పెళ్ళిళ్ళే సమాధానంగా మాట్లాడేవారు. ఈ పాయింట్ కాపులకే కాకుండా అందరికీ చిరాకు తెప్పించింది. అయితే ఈ విషయంలో జగన్ అసలు తన వ్యూహం కూడా మార్చుకునే ప్రయత్నం చేయలేదు.

ఈ వ్యతిరేకత చివరకు ఏ స్థాయికి దారి తీసింది అంటే, పవన్ కళ్యాణ్ ను బలంగా వ్యతిరేకించి, జనసేన రాజకీయాలను బలంగా వ్యతిరేకించే కాపు నాయకుల కుటుంబాల్లోని వారు కూడా ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు తెచ్చే పరిస్థితికి వెళ్లింది.

ముద్రగడ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు తోటి కులస్తుల నుంచి ఎదుర్కొన్న ఒత్తిడి వల్లో, స్వతహాగా వారికున్న రాజకీయ అభిప్రాయాలతోనో పవన్ విషయంలో ఆయన కూతురు బయటకు వచ్చింది. గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు ఏకీకరణకు ఒక సంకేతంగా భావించవచ్చనే అభిప్రాయం ఉంది.

కాపుల్లో పెరిగిన రాజకీయ ఐక్యత…

జనసేన-కూటమికి కాపు ఓట్లు పడటంతో మరో కారణం కుల ఐక్యత. ప్రతీ కులం తమ కులంలో ఐక్యత లేదనే చెప్పుకుంటుంది. దీని గురించి ఆ కుల పెద్దలు తెగ బాధపడిపోతూ ఉంటారు. కాపుల్లో కూడా అదే కనిపిస్తుంది. తమలో ఐక్యత లేదని బాధపడడం కూడా ఐక్యతకు ఒక చిహ్నమేననే వాదన కూడా ఉంది.

గత దశాబ్ద కాలంలో ప్రజారాజ్యం వైఫల్యం కూడా కాపుల్లో ఐక్యత కావాలనే కోరిక, వాదన బలపడేలా చేశాయి. ప్రజారాజ్యం వైఫల్యం కాపులకు ఒక చేదు నిజంలా కనిపించసాగింది. వాళ్లు మరో వైఫల్యాన్ని చూడదలుచు కోవడం లేదు. అందుకు అనుగుణంగానే కాపుల్లో ఐక్యత పెరిగింది కూడా. అది ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందనే అంచనా ఉంది. గోదావరి జిల్లాల్లో మనవాళ్లే ఓట్లు వెయ్యరండీ నుంచి మొదలై, మనవాళ్లంతా ఓటు వేస్తారనే వరకూ వచ్చింది.

ఓసీ జనరల్ కేటగిరీలో ఉన్న కాపుల్లో మధ్య తరగతి వాటా చాలా ఎక్కువ. కూలి పని నుంచి కోటీశ్వరుల వరకూ కనిపించే కులం అది. అందులో పెద్ద భూస్వాములూ ఉన్నారు, తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసే వారూ ఉన్నారు. స్థూలంగా జగన్మోహన రెడ్డి పరిపాలనలో ఆక్వా రైతులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు పెద్దగా లాభపడలేదు.

ఖర్చులు పెరగడం ఇతరత్రా అనేక రకాలుగా వారి వ్యాపారాలు, ఉపాధి దెబ్బతిన్నాయి. పెరిగిన ధరలు అన్ని రకాలుగా, చిరు వ్యాపారుల మీద, స్వయం ఉపాధి పొందే వారి మీద ఘోరంగా పడింది. అందులో మెజార్టీ ఉన్న కాపులు కూడా వ్రుత్తి పరంగా జగన్ విషయంలో సంతృప్తిగా లేరనే వాదన ఉంది. జగన్ విధానాల వల్ల ఈ కులంలోని మెజార్టీ ప్రజల ఆర్థిక పరిస్థితి బావుండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, ప్రస్తుతం ఆంధ్రలో వ్యాపార, స్వయం ఉపాధి వర్గాలెవరూ జగన్ పట్ల సానుకూలంగా లేకపోవడం అనే ధోరణి కాపుల్లో కూడా కనిపిస్తోంది.

వైసీపీ ఆశలన్నీ పథకాల మీదే…

అయితే ఇదే విషయంలో వైయస్సార్సీపీకి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా పేద, దిగువ మధ్య తరగతి కాపు మహిళల్లో వైయస్ జగన్ పెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన మహిళలు, తమ కులం అనే భావన లేకుండా నేరుగా జగన్ కి పక్కాగా ఓటేస్తారని వైఎస్సార్సీపీ గంపెడాశతో ఉంది.

ఇతర అన్ని వర్గాల మహిళలకూ వచ్చిన వాటికి అదనంగా, కాపు మహిళలకు నేరుగా నగదు జమ పథకాలు బాగా అందాయి. వారంతా ఒకవేళ తమ ఇంట్లో మగవారు కూటమికి ఓటేయాలని సూచించినా వారు మాత్రం జగన్ కు ఓటేస్తారని వైఎస్సార్సీపీ నమ్ముతోంది. అయితే కాపు మహిళలు జగన్ సంక్షేమం చూస్తారా? లేక దాదాపు అవే తరహా హామీలిచ్చిన ఎన్డీఏ కూటమికి జై కొడతారా అన్నది చూడాలి.

తదుపరి వ్యాసం