తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Glass Symbol : జనసేనకు ఈసీ గుడ్ న్యూస్, కామన్ సింబల్ గా 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు

Janasena Glass Symbol : జనసేనకు ఈసీ గుడ్ న్యూస్, కామన్ సింబల్ గా 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు

28 April 2024, 22:03 IST

google News
    • Janasena Glass Symbol : జనసేన పార్టీకి కామన్ సింబల్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
జనసేనకు కామన్ సింబల్ గా 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు
జనసేనకు కామన్ సింబల్ గా 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు

జనసేనకు కామన్ సింబల్ గా 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు

Janasena Glass Symbol : జనసేన(Janasena)కు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో(General Elections 2024) పోటీకి కామన్ సింబల్(Common Symbol) 'గాజు గ్లాసు'(Glass Tumbler) గుర్తును జనసేనకు కేటాయించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా(CEO Mukesh Kumar Meena) ఆదేశాలు జారీ చేశారు. గతంలో గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్స్‌(Free Symbols) జాబితాలో చేర్చింది. అయితే జనసేన అభ్యర్థన మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ(TDP), బీజేపీ(BJP)తో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. అలాగే సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీ జై భారత్‌ నేషనల్‌ పార్టీకి కామన్ సింబల్ టార్చ్‌లైట్‌(Torch Light) గుర్తును కేటాయించింది ఈసీ.

ప్రత్తిపాడు, జగ్గయ్యపేటలో పవన్ ప్రచారం

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రత్తిపాడు, జగ్గయ్యపేట వారాహి (Vahari)విజయ భేరి యాత్రలో పాల్గొన్నారు. ఇక్కడ నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ.. కూటమి నుంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు(Chandrababu), మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) ఉన్నారన్నారు. పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడే తాను ఉన్నానన్నారు. కూటమికి అండగా నిలబడాలని కోరారు. రాష్ట్రం కోసం పనిచేసే భాధ్యత తీసుకుంటామన్నారు. తాను ఓడిపోయినా మళ్లీ పార్టీ నడుపుతాను తప్ప వెనక్కు వెళ్లనన్నారు పవన్ కల్యాణ్(Pawan Kalyan). కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దెబ్బ తింటుందన్నారు. మీ భవిష్యత్తు కోసం గళం ఎత్తుతూనే ఉంటాను, మీ కోసం పనిచేస్తూనే ఉంటానని పవన్ అన్నారు. అరటిపండు తొక్క లాంటి జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని తీసి అవతల పడేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ (Kakinada)పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని, రేపటి రోజున ఆయన తప్పు చేసినా నిలదీస్తానన్నారు. నేను తప్పు చేస్తే మీరు నన్ను మీరు నిలదీయండన్నారు. చాలా మంది అరచేతుల్లో హారతులు వెలిగిస్తున్నారని, జగన్ ప్రభుత్వం(Jagna Govt) లాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి అదొక ధైర్య జ్యోతిలా కనిపిస్తుందన్నారు.

రైతులకు సాగునీటి కష్టాలు

"సాగు నీటి విషయంలో రైతులు కష్టపడుతున్నారు. మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగా నడవట్లేదు. ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాలలో పదివేల ఎకరాలకు ఇవ్వాలని మల్లవరం జడ్, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.132 కోట్లు అంచనావేసి రెండు సార్లు శంకుస్థాపన చేశారు కానీ నిధులు ఇవ్వలేదు. 2014 - 2019 మధ్య 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) జరిగితే. జగన్ ప్రభుత్వంలో 8 లక్షల విధ్యర్థుల కన్నా తక్కువ జరిగింది. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే, యువకులు వ్యాపారాలు పెట్టుకోవాలి అంటే పర్మిషన్లు ఉండవు కానీ వైసీపీ(Ysrcp) నాయకులు మాత్రం ఎలాంటి పర్మిషన్లు లేకుండా లాడ్జ్ లు కట్టేసుకున్నారు. భవిష్యత్తులో కూడా యువత కోసం నా అంత కష్టపడే నాయకుడు లేడు అన్నట్టు అహర్నిశలు పని చేస్తాను"- పవన్ కల్యాణ్

తదుపరి వ్యాసం