AP CPM Congress: ఏపీలో సిపిఎం, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి…! ఓ ఎంపీ, 10అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
09 April 2024, 12:04 IST
- AP CPM Congress: ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఓ ఎంపీ స్థానంతో పాటు 10ఎమ్మెల్యే స్థానాలను వామపక్షాలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది.
ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు
AP CPM Congress: ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో Communists కాంగ్రెస్ Congress పార్టీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే సిపిఐతో సీట్ల సర్దుబాటు పూర్తి కాగా సిపిఎం CPMతో కూడా ఆ పార్టీ అవగాహనకు Alliance వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటుకు విముఖత చూపిన సిపిఎం నష్టపోయింది. ఒక్క స్థానంతో సర్దుకు పోయేందుకు అంగీకరించిన సిపిఐ అసెంబ్లీలో అడుగు పెట్టింది.
ఏపీలో కూడా సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఒక పార్లమెంటు స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాలను సిపిఐకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. తాజగా సిపిఎంతో కూడా అవగాహన కుదిరింది.
ఐదు స్థానాల్లో ఏకాభిప్రాయం…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక లోక్‌సభతో పాటు, పది శాసనసభ స్థానాలకు సీపీఎం సోమవారం అభ్యర్థులు పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీతో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు లోక్‌సభ, రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు పట్టణం శాసనసభ స్థానాలపై పరస్పర అంగీకారం కుదరగా.. మిగతా అయిదు స్థానాలపై స్పష్టత రాలేదు.
సీపీఎం మాత్రం మొత్తం పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొలిక్కిరాని అయిదు స్థానాలపై నామినేషన్ దాఖలు గడువు ముగిసేలోగా ఇరు పార్టీలు ఒక అవగాహనకు రానున్నట్లు సీపీఎం పేర్కొంది. విజయవాడ సెంట్రల్, గాజువాక, సంతనూతలపాడు(ఎస్సీ) స్థానాలు తప్పనిసరిగా కావాలని సీపీఎం పట్టుబడుతోంది. దీనిపై కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఆమోదించిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు.
పార్లమెంటు :
1. అరకు (ST) పార్లమెంటు స్థానానికి - పాచిపెంట అప్పలనర్స పోటీ చేయనున్నారు.
అసెంబ్లీ స్థానాల్లో
1. రంపచోడవరం (ST) - లోతా రామారావు
2. అరకు (ST) - దీసరి గంగరాజు
3. కురుపాం (ST) - మండంగి రమణ
4. గాజువాక - మరడాన జగ్గునాయుడు
5. విజయవాడ సెంట్రల్ - చిగురుపాటి బాబురావు
6. గన్నవరం - కళ్ళం వెంకటేశ్వరరావు
7. మంగళగిరి - జొన్నా శివశంకర్
8. నెల్లూరు సిటీ - మూలం రమేష్
9. కర్నూలు - డి.గౌస్‌దేశాయి
10. సంతనూతలపాడు (SC) - ఉబ్బా ఆదిలక్ష్మి పేర్లను సిపిఎం ప్రకటించింది.
సిపిఐ CPIతో కుదిరిన పొత్తు…
జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఐ CPI ఏపీలో కూడా పొత్తును కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. నాటి ఎన్నికల్లో జనసేన రాజోలులో మాత్రమే గెలిచింది. వామపక్షాలకు కనీస ప్రాతినిథ్యం దక్కకుండా పోయింది. ఈసారైనా సిపిఐ అభ్యర్థిని అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.
ఏపీలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం భారత జాతీయ కాంగ్రెస్, సీపీఐల మధ్య సీట్ల పంపకంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలరెడ్డి Ys Sharmila, సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో పలుమార్లు చర్చలు జరిపారు.
సీట్ల సర్దుబాటులో భాగంగా ఒక పార్లమెంటు స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేయాలని నిర్ణయించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది.ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తారు. వీటిలో పోటీ చేసే అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.
CPIఅభ్యర్థులు పోటీ చేసే స్థానాలు ఇవే…
1. విజయవాడ వెస్ట్
2. విశాఖపట్నం వెస్ట్
3. అనంతపురం
4. పత్తికొండ
5. తిరుపతి
6. రాజంపేట
7. ఏలూరు
8. కమలాపురం