తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Congress Candidates List : కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల, రేపు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల!

AP Congress Candidates List : కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల, రేపు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల!

01 April 2024, 14:30 IST

google News
    • AP Congress Candidates List : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ఆ పార్టీ స్టేట్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు.
రేపు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
రేపు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

రేపు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

AP Congress Candidates List : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో అభ్యర్థుల ఖరారుకు కాంగ్రెస్ అధిష్టానం(Congress) కసరత్తు పూర్తి చేసింది. దిల్లీలో ఏఐసీసీ పెద్దలతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, రఘువీరారెడ్డి, జేడీ శీలం భేటీ అయ్యారు. ఈ భేటీలో 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులను(AP Congress Candidates) ఖరారు చేశామని షర్మిల తెలిపారు. రేపు(ఏప్రిల్ 2) ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామన్నారు. ఆదివారం రాత్రి దిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మధుసూధన్‌ మిస్త్రీ నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చించట్లు షర్మిల(YS Sharmila) తెలిపారు. దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. అయితే పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రెండు, మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీ ఇచ్చామన్నారు. అధిష్టానం నిర్ణయంతో రేపు తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

వామపక్షాలకు సీట్లు?

కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్లీలో సోమవారం కాం గ్రెస్ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల(AP Congress Candidates List) ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొత్తుల్లో భాగంగా వామపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను పెండింగ్ పెట్టింది కాంగ్రెస్. అనంతపురం, తిరుపతి, నంద్యాల, గుంటూరు, విజయవాడ, కర్నూల్, అమలాపురం, అరకు స్థానాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రాజమండ్రి లోక్ సభ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు సమాచారం. ఏఐసీసీ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ పల్లం రాజు కాకినాడ లోక్ సభ స్థానం(Kakinada Loksabha) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

కడప లోక్ సభ బరిలో షర్మిల

కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడ వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో షర్మిల బరిలోకి దిగితే కుటుంబ సభ్యుల మధ్య హోరాహోరీ పోటీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఇక రాజమండ్రి నుంచి ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju) పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ లోక్ సభ స్థానం నుంచి సత్యా రెడ్డి, కాకినాడ నుంచి మాడీ ఎంపీ పల్లంరాజు పోటీ చేస్తారని సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నాక, కాంగ్రెస్(Congress) లో కాస్త జోష్ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో సీట్లు ఇస్తామన్న పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసుందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆశావహుల నుంచి భారీగా దరఖాస్తులు అందాయి.

అవినాష్ వర్సెస్ షర్మిల

తన సోదరుడు, సీఎం జగన్ తో(YS Jagan) విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన షర్మిల(YS Sharmila) రాజకీయ పార్టీని చెప్పి... ఇటీవల దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి(YS Avinash Reddy) వైసీపీ కడప లోక్ సభ స్థానం నుంచి పోటీకి నిలిపింది. వైఎస్ వివేకా(YS Viveka) కుమార్తె సునీతకు మద్దతుగా నిలిచి షర్మిల...ఇప్పుడు కడప లోక్ సభ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. కడప అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ఆర్ మరణాంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పట్టుసాధించింది. అయితే ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన షర్మిల కడపలో పోటీ చేస్తున్నారన్న వార్త హల్ చల్ చేస్తుంది. షర్మిల బరిలో దిగితే పోటీ హోరాహోరీగా ఉండనుంది. దీంతో కడప ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం