తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin: డెబ్యూ మ్యాచ్‌తో పాటు లాస్ట్ మ్యాచ్‌లో అశ్విన్‌తో క‌లిసి ఆడిన ఇద్ద‌రు టీమిండియాక్రికెట‌ర్లు ఎవ‌రంటే?

Ashwin: డెబ్యూ మ్యాచ్‌తో పాటు లాస్ట్ మ్యాచ్‌లో అశ్విన్‌తో క‌లిసి ఆడిన ఇద్ద‌రు టీమిండియాక్రికెట‌ర్లు ఎవ‌రంటే?

22 December 2024, 17:34 IST

google News
  • Ashwin ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అశ్విన్ డెబ్యూ మ్యాచ్‌తో పాటు ఆడిన చివ‌రి మ్యాచ్‌లో అత‌డితో క‌లిసి ఇద్ద‌రు క్రికెట‌ర్లు టీమిండియాకు ప్రాతినిథ్యం వ‌హించారు. ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఎవ‌రంటే?

అశ్విన్
అశ్విన్

అశ్విన్

టీమిండియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ల‌లో ఒక‌రిగా అశ్విన్ పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో కుంబ్లే త‌ర్వాత అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డ్ నెల‌కొల్పాడు. టెస్టుల్లో కుంబ్లే 619 వికెట్లు తీయ‌గా...అశ్విన్ 537 వికెట్ల‌ను సొంతం చేసుకున్నాడు. ప‌ధ్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మూడు ఫార్మెట్ల‌లో క‌లిపి 765 వికెట్ల‌ను సొంతం చేసుకున్నాడు అశ్విన్‌.

స‌డెన్ రిటైర్‌మెంట్‌...

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇటీవ‌ల ముగిసిన గ‌బ్బా టెస్ట్ త‌ర్వాత ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు అనుహ్యంగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి అభిమానుల‌కు షాకిచ్చాడు అశ్విన్‌. అత‌డి రిటైర్‌మెంట్ కుటుంబ‌స‌భ్యులు, క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు అభిమానులు సైతం జీర్ణించుకోలేక‌పోతారు. సిరీస్ మ‌ధ్య‌లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఇండియాకు వ‌చ్చేశాడు అశ్విన్‌.

కోహ్లి...రోహిత్‌...

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అశ్విన్ అరంగేట్రం చేసిన‌ తొలి మ్యాచ్‌లో...చిట్ట చివ‌రి మ్యాచ్‌లో అత‌డితో క‌లిసి ఓ ఇద్ద‌రు క్రికెట‌ర్లు టీమిండియాలో క‌నిపించారు.ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఎవ‌రో కాదు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి. 2010లో హ‌రారే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా వ‌న్డేల్లోకి అశ్విన్ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన విరాట్ కోహ్లి హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. 95 బాల్స్‌లో 68 ప‌రుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో ఐదో స్థానంలో 32 ప‌రుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యాభై ఓవ‌ర్ల‌లో 268 ప‌రుగులు చేసింది. ఈ టార్గెట్‌ను మ‌రో ప‌ది బాల్స్ మిగిలుండ‌గానే శ్రీలంక చేధించింది. ఈ డెబ్యూ వ‌న్డే మ్యాచ్‌లో అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

పింక్ బాల్ టెస్ట్‌...

ఇంట‌ర్నేష‌న‌ల్ కెరీర్‌లో చివ‌రి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడాడు అశ్విన్‌. ఆడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్ట్ అశ్విన్ కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. . ఈ మ్యాచ్‌లో అశ్విన్‌తో క‌లిసి తుది జ‌ట్టులో రోహిత్‌, కోహ్లి ఆడారు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిసి కోహ్లి 18 ప‌రుగులు, రోహిత్ శ‌ర్మ తొమ్మిది ప‌రుగులు చేశారు. అశ్విన్ కూడా బౌలింగ్‌గా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. కేవ‌లం ఒకే ఒక వికెట్ తీశాడు.

అశ్విన్‌, రోహిత్‌, కోహ్లి క‌లిసి ఆడిన మొద‌టి మ్యాచ్‌లో, చివ‌రి మ్యాచ్‌లో టీమిండియా ఓట‌మి పాల‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

తదుపరి వ్యాసం