Sarfaraz Khan: తప్పు ఒప్పుకున్న సర్ఫరాజ్ ఖాన్ - గవాస్కర్‌కు క్షమాపణలు చెప్పిన యంగ్ క్రికెటర్
14 March 2024, 9:15 IST
Sarfaraz Khan: సునీల్ గవాస్కర్‌కు టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. మరోసారి తప్పులు రిపీట్ చేయనని ప్రామిస్ చేశాడు. అలా ఎందుకు చేశాడంటే?
సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan: టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు క్షమాపణలు చెప్పాడు. మరోసారి తప్పు చేయనని అన్నాడు. ఇంతకీ ఏ విషయంలో గవాస్కర్‌కు సర్ఫరాజ్ ఖాన్ క్షమాపణలు చెప్పాడంటే...ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు.
దూకుడుగా ఆడాలనే తొందరపాటులో టీ బ్రేక్ తర్వాత మూడో సెషన్‌లో తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌ను షాట్ కొట్టబోయాడు. కానీ అతడి అంచనా తప్పడంతో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.
కామెంటేటర్‌గా గవాస్కర్...
మ్యాచ్‌కు కామెంటేటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్...సర్ఫరాజ్ ఆటతీరును తప్పుపట్టాడు. అది షాట్ ఆడాల్సిన బాల్ కాదు. తొందరపాటుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దూకుడు తగ్గిస్తే మంచిది అంటూ సర్ఫరాజ్‌కు సలహా ఇచ్చాడు గవాస్కర్.
డబుల్ సెంచరీ పూర్తయిన అనంతరం ఆ తర్వాతి బంతిని జీరో స్కోరు నుంచే మొదలుపెట్టినట్లు తాను భావిస్తానని డాన్ బ్రాడ్‌మన్ అన్న మాటలను సునీల్ గవాస్కర్ గుర్తుచేశారు. అంతే కాకుండా మ్యాచ్ ముగిసిన అనంతరం సర్ఫరాజ్‌తో సునీల్ గవాస్కర్ ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. షాట్స్ ఎంపిక, క్రీజులో నిలదొక్కుకోవడం ఎలా అనే విషయంలో సర్ఫరాజ్‌కు సునీల్ గవాస్కర్ విలువైన సలహాలు ఇచ్చాడట.
సర్పరాజ్ క్షమాపణలు...
దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సర్ఫారజ్‌తో గవాస్కర్ మాట్టాడట. గవాస్కర్ మాటలతో రియలైజ్ అయిన సర్ఫరాజ్ అతడికి క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. మరోసారి ఇలాంటి తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడతానని గవాస్కర్‌కు సర్ఫరాజ్ మాటిచ్చినట్లు తెలిసింది. గవాస్కర్, సర్ఫరాజ్ మధ్య జరిగిన సంభాషణను గురించి బిజినెస్‌మెన్ శ్యామ్ భాటియా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దుబాయ్‌కి చెందిన ఈ బిజినెస్‌మెన్ గవాస్కర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు.
మూడు హాఫ్ సెంచరీలు...
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తోనే టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అనూహ్యంగా జట్లులోకి వచ్చిన అతడు మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. మూడు టెస్టులలో కలిపి రెండు వందల పరుగులు చేశాడు.
వన్డే తరహాలో దూకుడుగా ఆడాడు. ఈ టెస్ట్ సిరీస్‌ను 4-1తో టీమిండియా సొంతం చేసుకున్నది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు పలువురు సీనియర్లు జట్టుకు దూరమైన యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురేల్ వంటి యంగ్ ప్లేయర్ల పోరాటంలో టీమిండియా ఈ సిరీస్‌లో అద్భుత విజయాలను నమోదు చేసుకున్నది. ఈ సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నది.