Fabian Allen: సౌతాఫ్రికాలో వెస్టిండీస్ క్రికెటర్‌కు వింత అనుభవం - గన్‌తో బెదిరించి దోచుకున్న దొంగలు
Fabian Allen: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ దోపీడికి గురయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతోన్న అలెన్‌ను జోహెన్నెస్‌బర్గ్‌లో కొందరు దుండగులు తుపాకితో బెదిరించి అతడి దగ్గరున్న విలువైన వస్తువుల్ని దోచుకున్నారు.
Fabian Allen: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ సౌతాఫ్రికాలో దోపిడీకి గురయ్యాడు. గన్‌తో అలెన్‌ను బెదిరించిన దుండగులు అతడి ఫోన్, బ్యాగ్‌తో పాటు ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఫాబియన్ అలెన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు ఆడుతోన్నాడు. పార్ల్ రాయల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ టోర్నీ కోసం జెహెన్నెస్‌బర్గ్ వచ్చిన అలెన్‌తో పాటు మరికొంత మంది క్రికెటర్లకు పార్ల్ రాయల్ యాజమాన్యం సాండ్‌టన్ సన్ హోటల్‌లో ఆతిథ్యం కల్పించింది.
హోటల్ సమీపంలోనే…
హోటల్‌కు సమీపంలో అలెన్‌లో తుపాకీతో బెదిరించిన దుండగులు అతడి ఫోన్, పర్స్‌తో పాటు విలువైన వస్తువుల్ని దోచుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో చుట్టుపక్కల కొంతమంది ఈ దోపీడిని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారిని గన్‌తో దుండగులు బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనలో అలెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అయితే గన్‌తో బెదిరించడంతో అతడు చాలా భయానికి లోనైనట్లు తెలిసింది. ఈ ఘటనపై పార్ల్ రాయల్ టీమ్‌తో వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్‌కు అలెన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
భద్రతపై ఆందోళన...
హోటల్ సమీపంలోనే అలెన్ దోపీడికి గురవ్వడంతో సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతోన్న క్రికెటర్లలో ఆందోళన వ్యక్తమవుతోన్నట్లు తెలిసింది. ఇంటర్‌నేషనల్ క్రికెటర్లకు కనీస భద్రత లేకుండా టీ20 లీగ్‌ను ఎలా నిర్వహిస్తున్నారంటూ కొంతమంది క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. టీ20 లీగ్ ఆడుతోన్న క్రికెటర్లు కూడా తమ భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే టీ20 లీగ్‌ను వదిలిపెట్టి వెళ్లిపోతామని టీ20 లీగ్ యాజమాన్యాలను హెచ్చరించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా తమ దేశ ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించాలని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్‌ను విండీస్ క్రికెట్ బోర్డ్ కోరినట్లు తెలిసింది. అలెన్‌తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతోన్న తమ క్రికెటర్లు క్షేమంగానే ఉన్నట్లు విండీస్ క్రికెట్ బోర్డ్ తెలిపింది.
వెస్టిండీస్ తరఫున...
వెస్టిండీస్ తరఫున ఫాబియన్ అలెన్ ఇప్పటివరకు 20 వన్డేలు, 34 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 200 రన్స్, ఏడు వికెట్లు తీశాడు. 34 టీ20 మ్యాచుల్లో 267 రన్స్, 24 వికెట్లు తీసుకున్నాడు. 2018లో ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అలెన్ అరంగేట్రం చేశాడు.
2022లో తన చివరి వన్డే మ్యాచ్‌ను ఇండియాపైనే ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో తన ఫస్ట్ మ్యాచ్, చివరి మ్యాచ్ ఇండియాపైనే ఆడటం గమనార్హం. ఫామ్‌లేని కారణంగా వన్డేలతో పాటు టీ20ల్లో స్థానం కోల్పోయాడు. సౌతాఫ్రికా 20 టీ20 లీగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు అలెన్. చివరి ఐదు మ్యాచుల్లో కేవలం 33 రన్స్, రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఐపీఎల్‌కు పోటీగా సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ ఏడాది ప్రారంభమైంది. మొత్తం ఆరు టీమ్‌లతో ప్రారంభమైన ఈ టోర్నీలో ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ ఆడటం లేదు.