తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup Super 8: టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 చేరిన టీమ్స్ ఇవే.. టీమిండియా ఎవరెవరితో ఆడుతుందంటే?

T20 World cup super 8: టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 చేరిన టీమ్స్ ఇవే.. టీమిండియా ఎవరెవరితో ఆడుతుందంటే?

Hari Prasad S HT Telugu

16 June 2024, 13:35 IST

google News
    • T20 World cup super 8: టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ స్టేజ్ ముగుస్తోంది. ఇప్పటికే సూపర్ 8 స్టేజ్ కు ఏడు టీమ్స్ క్వాలిఫై కాగా.. మరొక్క బెర్తు కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. మరి నెక్ట్స్ స్టేజ్ లో టీమిండియా ఎవరెవరితో ఆడుతుందో చూడండి.
టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 చేరిన టీమ్స్ ఇవే.. టీమిండియా ఎవరెవరితో ఆడుతుందంటే?
టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 చేరిన టీమ్స్ ఇవే.. టీమిండియా ఎవరెవరితో ఆడుతుందంటే?

టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 చేరిన టీమ్స్ ఇవే.. టీమిండియా ఎవరెవరితో ఆడుతుందంటే?

T20 World cup super 8: టీ20 వరల్డ్ కప్ 2024 లీగ్ స్టేజ్ సోమవారం (జూన్ 17) బంగ్లాదేశ్, నేపాల్.. శ్రీలంక, నెదర్లాండ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ లతో ముగియనుంది. బుధవారం (జూన్ 19) నుంచి సూపర్ 8 స్టేజ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే 7 టీమ్స్ నెక్ట్స్ రౌండ్ కు అర్హత సాధించాయి. మరొక్క స్థానం కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. మరి ఈ సూపర్ 8 స్టేజ్ షెడ్యూల్, టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల గురించి ఇక్కడ చూడండి.

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్ టీమ్స్

ఈసారి టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తంగా 20 టీమ్స్ పాల్గొన్న విషయం తెలిసిందే. వీటిలో 12 టీమ్స్ లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టనుండగా.. 8 టీమ్స్ తర్వాతి రౌండ్ కు వెళ్తాయి. అక్కడ ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి ఆడిస్తారు. వాటిలో నుంచి నాలుగు టీమ్స్ సెమీఫైనల్స్ వెళ్తాయి. అయితే ఇప్పటికే 8 జట్లలో ఏడు జట్లు తమ సూపర్ 8 బెర్త్ కన్ఫమ్ చేసుకున్నాయి.

గ్రూప్ ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ.. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్.. గ్రూప్ డి నుంచి సౌతాఫ్రికా క్వాలిఫై అయ్యాయి. గ్రూప్ డి నుంచి మరో స్థానం కోసం నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు టీమ్స్ సోమవారం (జూన్ 16) తమ చివరి లీగ్ మ్యాచ్ లలో వరుసగా శ్రీలంక, నేపాల్ టీమ్స్ తో ఆడతాయి.

ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో గ్రూప్ డిలో బంగ్లాదేశ్ 4 పాయింట్లు, 0.478 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ 3 మ్యాచ్ లలో 2 పాయింట్లు, -0.408 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ లో నేపాల్ చేతుల్లో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోవడంతోపాటు శ్రీలంకపై నెదర్లాండ్స్ ఘనంగా గెలిస్తేనే ఆ జట్టుకు సూపర్ 8 ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బంగ్లాదేశే సూపర్ 8కు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

సూపర్ 8 గ్రూప్స్ ఇలా..

సూపర్ 8 స్టేజ్ లో ఎనిమిది టీమ్స్ ను రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ ఉంటాయి. గ్రూప్ 2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, యూఎస్ఏ ఉన్నాయి. లీగ్ స్టేజ్ లాగే ఈ జట్లన్నీ తమ గ్రూపులోని ప్రతి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి.

ఆ లెక్కన సూపర్ 8లో ఇండియా.. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ తోపాటు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంటుంది. బుధవారం (జూన్ 19) యూఎస్ఏ, సౌతాఫ్రికా మధ్య ఆంటిగ్వాలో మ్యాచ్ తో సూపర్ 8 స్టేజ్ ప్రారంభం కానుంది.

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 షెడ్యూల్

గ్రూప్ 1: ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్

జూన్ 20 : ఇండియా vs ఆఫ్ఘనిస్థాన్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్

జూన్ 20: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వా

జూన్ 22: ఇండియా vs బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వా

జూన్ 22: ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్థాన్, సెయింట్ విన్సెంట్

జూన్ 24: ఇండియా vs ఆస్ట్రేలియా, సెయింట్ లూసియా

జూన 24: ఆఫ్ఘనిస్థాన్ vs బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, సెయింట్ విన్సెంట్

గ్రూప్ 2: సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, యూఎస్ఏ

జూన్ 19: సౌతాఫ్రికా vs యూఎస్ఏ, ఆంటిగ్వా

జూన్ 19: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, సెయింట్ లూసియా

జూన్ 21: ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, సెయింట్ లూసియా

జూన్ 21: యూఎస్ఏ vs వెస్టిండీస్, బార్బడోస్

జూన్ 23: యూఎస్ఏ vs ఇంగ్లండ్, బార్బడోస్

జూన్ 23: వెస్టిండీస్ vs సౌతాఫ్రికా, ఆంటిగ్వా

తదుపరి వ్యాసం