తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup 2024: టీ20ల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నమీబియా బౌలర్.. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో గెలిచిన టీమ్

T20 World Cup 2024: టీ20ల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నమీబియా బౌలర్.. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో గెలిచిన టీమ్

Hari Prasad S HT Telugu

03 June 2024, 9:57 IST

google News
    • T20 World Cup 2024: టీ20 క్రికెట్ లో నమీబియా బౌలర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. ఒమన్ తో మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో నమీబియా గెలిచింది.
టీ20ల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నమీబియా బౌలర్.. ఎవరికీ సాధ్యం కాని ఘనత ఇది
టీ20ల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నమీబియా బౌలర్.. ఎవరికీ సాధ్యం కాని ఘనత ఇది

టీ20ల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నమీబియా బౌలర్.. ఎవరికీ సాధ్యం కాని ఘనత ఇది

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా నమీబియా, ఒమన్ మ్యాచ్ లో ఓ కొత్త రికార్డు నమోదైంది. నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఒమన్ తో సోమవారం (జూన్ 3) జరిగిన మ్యాచ్ లో అతడు తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసుకున్నాడు. గతంలో ఏ ఇతర బౌలర్ కు ఈ ఘనత సాధ్యం కాలేదు.

ట్రంపెల్‌మాన్ రికార్డు

టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన నమీబియా తమ తొలి మ్యాచ్ ను ఒమన్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో మొదట నమీబియా బౌలింగ్ చేసింది. అయితే వాళ్లకు కళ్లు చెదిరే ఆరంభం లభించింది. కొత్త బంతితో ట్రంపెల్‌మాన్ అద్భుతమే చేశాడు. తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దీంత ఒమన్ టీమ్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

కశ్యప్ ప్రజాపతి (0), అఖిబ్ ఇలియాస్ (0) డకౌట్ అయ్యారు. ఇలా ఓ టీ20 మ్యాచ్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తర్వాత కూడా ట్రంపెల్‌మాన్ మరో రెండు వికెట్లు తీయడంతో ఒమన్ టీమ్ కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. ట్రంపెల్‌మాన్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.

మరో పేస్ బౌలర్ డేవిడ్ వీస్ 3.4 ఓవర్లలో 28 పరుగులకు 3 వికెట్లు తీశాడు. ఒమన్ తరఫున ఖాలిద్ కైల్ మాత్రమే 34 పరుగులతో రాణించాడు. గ్రూప్ బిలో భాగంగా బార్బడోస్ లో ఈ మ్యాచ్ జరిగింది. అయితే నమీబియా కూడా 110 పరుగులు చేయలేకపోయింది. ఆ టీమ్ కూడా 20 ఓవర్లలో సరిగ్గా 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ తప్పలేదు.

12 ఏళ్ల తర్వాత సూపర్ ఓవర్

టీ20 వరల్డ్ కప్ లో సూపర్ ఓవర్ నమోదు కావడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2012లో చివరిసారి న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య సూపర్ ఓవర్ కాగా.. మళ్లీ ఇన్నాళ్లకు మరో సూపర్ ఓవర్ అవసరమైంది. ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ చివరి ఓవర్లో కేవలం 5 పరుగుల లక్ష్యాన్ని కాపాడటం విశేషం. అతడు రెండు వికెట్లు కూడా తీశాడు.

ఒక దశలో నమీబియా ఈ లక్ష్యాన్ని ఛేదించినట్లే కనిపించినా.. చివర్లో దారి తప్పింది. అతడు 3 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 109 రన్స్ చేసింది. జాన్ ఫ్రైలింక్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 21 రన్స్ చేసింది. తర్వాత ఒమన్ వికెట్ కోల్పోయి కేవలం 10 పరుగులే చేయగలిగింది. దీంతో నమీబియా ఊహకందని విజయం సాధించింది.

తదుపరి వ్యాసం