తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మళ్లీ మారాడు.. ఐపీఎల్లో తొలి 20 కోట్ల మార్క్ ప్లేయర్‌కే పట్టం

Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మళ్లీ మారాడు.. ఐపీఎల్లో తొలి 20 కోట్ల మార్క్ ప్లేయర్‌కే పట్టం

Hari Prasad S HT Telugu

04 March 2024, 11:56 IST

    • Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ వచ్చేశాడు. ఊహించినట్లే గతేడాది ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన, ఐపీఎల్లో రూ.20 కోట్ల మార్క్ దాటిన తొలి ప్లేయర్ అయిన కమిన్స్ కే పట్టం కట్టారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ (PTI)

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్

Pat Cummins: ఊహించిందే జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అత్యధిక ధర ప్లేయర్ అయిన ప్యాట్ కమిన్స్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇన్నాళ్లూ కెప్టెన్ గా ఉన్న ఏడెన్ మార్‌క్రమ్ ను తప్పించి కమిన్స్ ను కెప్టెన్ గా చేసింది. గతేడాది ఆస్ట్రేలియాకు ఆరోసారి వరల్డ్ కప్ సాధించి పెట్టిన కమిన్స్ ను గత వేలంలో సన్ రైజర్స్ ఏకంగా రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

ప్యాట్ కమిన్స్‌కే కెప్టెన్సీ

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గత రెండు సీజన్లుగా దారుణమైన్ ప్రదర్శన చేస్తోంది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ దూరమైన తర్వాత ఏడెన్ మార్‌క్రమ్ కు కెప్టెన్సీ ఇచ్చినా పలితం లేకపోయింది. గతేడాది 14 మ్యాచ్ లలో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల టేబుల్లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో గత వేలంలో ఏకంగా రూ.20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది.

అప్పుడే ఇక అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం లాంఛనమే అనుకున్నారు. మొత్తానికి సోమవారం (మార్చి 4) ఆ ఫ్రాంఛైజీ అధికారికంగా అనౌన్స్ చేసింది. "ఆరెంజ్ ఆర్మీ.. మన కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఐపీఎల్ 2024లో ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీని ఏడెన్ మార్‌క్రమ్ నుంచి తీసుకోనున్నాడు.

నిజానికి మార్‌క్రమ్ ఎస్ఏ20లో కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. అక్కడ కూడా సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ గా ఉన్న మార్‌క్రమ్ వరుసగా రెండు టైటిల్స్ ను ఆ టీమ్ కు అందించాడు. కానీ అదే సక్సెస్ ను ఐపీఎల్లో కొనసాగించలేకపోయాడు. కొత్త కెప్టెన్ కోసం చూసిన సన్ రైజర్స్.. వేలంతోనే ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 20.5 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో రూ.24.75 కోట్లతో మిచెల్ స్టార్క్ ఉన్న విషయం తెలిసిందే. అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.

కమిన్స్ vs స్టార్క్

ఐపీఎల్ 2024లో కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ తన తొలి మ్యాచ్ ను తన నేషనల్ టీమ్ మేట్ స్టార్క్ ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ తోనే ఆడనున్నాడు. ఈ మ్యాచ్ మార్చి 23న జరగనుంది. మార్చి 22న ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ తో ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరుసటి రోజే కమిన్స్, స్టార్క్ మధ్య వార్ చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.

గతేడాది ఆస్ట్రేలియాను ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కమిన్స్ కెప్టెన్సీలో తమ రాత మారుతుందని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆశతో ఉంది. గతేడాది వేలంలో కమిన్స్ తోపాటు ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్లను కూడా సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2024 సీజన్ తొలి విడత షెడ్యూల్ మాత్రమే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తర్వాత దానిని బట్టి మిగతా మ్యాచ్ లు షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు.

తదుపరి వ్యాసం