IPL 2024 Auction Highlights: ఐపీఎల్ చరిత్రలో స్టార్క్ సరికొత్త రికార్డ్.. అమ్ముడైన 72 మంది ఆటగాళ్లు
IPL 2024 Auction Highlights: ఐపీఎల్ 2024 సీజన్ కోసం మినీ వేలం నేడు జరిగింది. ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేలంలో చరిత్ర సృష్టించగా.. కమిన్స్ భారీ ధర దక్కించుకున్నాడు. కొందరు యంగ్ ప్లేయర్లు భారీ రేటుతో జాక్‍పాట్ కొట్టారు. వేలం హైలైట్స్ ఇక్కడ చూడండి.
IPL 2024 Auction Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం నేడు (డిసెంబర్ 19) దుబాయి వేదికగా మినీ వేలం జరిగింది. వేలంలో అవసరమైన ఆటగాళ్లను దక్కించుకునేందుకు 10 జట్లు వేలంలో పోటీ పడ్డాయి. మొత్తంగా 72 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. ఈ వేలంలో రూ.24.75 కోట్ల ధర పలికిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయిన స్టార్క్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. ఈ వేలంలో అంతకుముందే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కమిన్స్ రూ.20.5 కోట్లతో క్రియేట్ చేసిన రికార్డు బ్రేక్ అయింది. స్టార్క్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇక కొందరు భారత దేశవాళీ ప్లేయర్లు ఈ వేలంతో కోటీశ్వరులయ్యారు. భారీ ధరకు యంగ్ ప్లేయర్స్ అమ్ముడయ్యారు. ఐపీఎల్ వేలం హైలైట్స్ ఇక్కడ చూడండి.
IPL 2024 Auction Live Updates
9.38: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 సీజన్ కోసం మినీ వేలంలో 72 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఈ వేలంలో 10 జట్లు మొత్తంగా రూ.230.45 కోట్లు ఖర్చు చేశాయి.
9.05: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలం ముగిసింది. ఈ వేలంలో చివరిగా సౌరవ్ చౌహాన్‍ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.
8:20 PM: IPL 2024 Auction Live Updates: భారత దేశవాళీ వికెట్ కీపర్ రాబిన్ మిన్జ్ ను రూ.3.6కోట్లకు గుజరాత్ టైటాన్స్ టీమ్ దక్కించుకుంది.
7:57 PM: IPL 2024 Auction Live Updates: బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‍ను రూ.2కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. నువాన్ తుషారాను ముంబై ఇండియన్స్ రూ.4.8కోట్లకు, జే రిచర్డ్ సన్‍ను రూ.5కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి.
7:39 PM: IPL 2024 Auction Live Updates: ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సెర్ జాన్సన్‍ను రూ.10కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. డేవిడ్ విల్లేను రూ.2కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
7:24 PM: IPL 2024 Auction Live Updates: వేలంలో చివరి రౌండ్ జరగనుంది. అమ్ముడుపోని ఆటగాళ్ల పేర్లు వేలానికి మరోసారి రానున్నాయి.
7:00 PM: IPL 2024 Auction Live Updates: అన్‍క్యాప్డ్ సెట్‍లో సుశాంత్ మిశ్రాను రూ.2.20కోట్లకు గుజరాత్ టైటాన్స్, ఎం.సిద్ధార్థ్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.2.4కోట్లకు దక్కించుకున్నాయి.
6:18 PM: IPL 2024 Auction Live Updates: భారత దేశవాళీ ప్లేయర్ కుమార్ కుశాగ్రను రూ.7.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
6:08 PM: IPL 2024 Auction Live Updates: భారత యంగ్ అన్‍క్యాప్డ్ బ్యాటర్ షారుఖ్ ఖాన్‍ను రూ.7.40 కోట్లకు దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్.
6:04 PM: IPL 2024 Auction Live Updates: యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వీని రూ.8.40కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. యూపీ టీ20 ప్రీమియర్ లీగ్‍లో సిక్స్ హిట్టింగ్‍లో రిజ్వి పాపులర్ అయ్యాడు. 9 మ్యాచ్‍ల్లోనే రెండు సెంచరీలతో 455 రన్స్ చేశాడు.
5:32 PM: IPL 2024 Auction Live Updates: భారత దేశవాళీ ప్లేయర్ శుభం దూబేను రూ.5.80కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.
5:00 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ వేలంలో బ్రేక్ కొనసాగుతోంది. కాసేపట్లో తిరిగి వేలం మొదలుకానుంది.
3:56 PM: IPL 2024 Auction Live Updates: స్పిన్నర్లపై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.
3:52 PM: IPL 2024 Auction Live Updates: శ్రీలంక పేస్ బౌలర్ దిల్షాన్ మదుషంకను ముంబై ఇండియన్స్ రూ.4.6 కోట్లకు సొంతం కేసుకుంది.
3:49 PM: IPL 2024 Auction Live Updates: పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ ను రూ.1.6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.
3:40 PM: IPL 2024 Auction Live Updates: అమ్ముడుపోని ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.
3:32 PM: IPL 2024 Auction Live Updates: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ, ముంబై పోటీ పడ్డాయి. మధ్యలో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ సీన్లోకి ఎంటరయ్యాయి. చివరికి స్టార్క్ ను ఏకంగా రూ.24.75 కోట్లకు నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.
3:27 PM: IPL 2024 Auction Live Updates: ఇండియా పేస్ బౌలర్ శివమ్ మావి రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. అతని కోసం లక్నో, బెంగళూరు పోటీ పడ్డాయి. చివరికి లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని ఏకంగా రూ.6.4 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.
3:23 PM: IPL 2024 Auction Live Updates: టీమిండియా పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ కనీస ధర రూ.2 కోట్లతో ఎంటరయ్యాడు. అతనికి మొదటగా సన్ రైజర్స్ ట్రై చేసింది. తర్వాత గుజరాత్ టైటన్స్ పోటీ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులోకి వచ్చింది. చివరికి గుజరాత్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది.
3:19 PM: IPL 2024 Auction Live Updates: వెస్టిండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ రూ.కోటి బేస్ ప్రైస్ తో ఎంటరయ్యాడు. అతని కోసం చెన్నై, ఢిల్లీ పోటీ పడ్డాయి. మధ్యలో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ రేసులోకి వచ్చాయి. చివరికి ఆర్సీబీ అతన్ని ఏకంగా రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది.
3:13 PM: IPL 2024 Auction Live Updates: పేస్ బౌలర్ చేతన్ సకారియా కనీస ధర రూ.50 లక్షలు. అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ అదే ధరకు కొనుగోలు చేసింది.
3:12 PM: IPL 2024 Auction Live Updates: న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. ఏ ఫ్రాంఛైజీ అతన్ని కొనలేదు.
3:12 PM: IPL 2024 Auction Live Updates: నాలుగో సెట్లో పేస్ బౌలర్ల వేలం జరుగుతోంది.
3:11 PM: IPL 2024 Auction Live Updates: శ్రీలంక వికెట్ కీపర్ కుశల్ మెండిస్ కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చినా.. ఏ ఫ్రాంఛైజీ అతన్ని కొనలేదు.
3:10 PM: IPL 2024 Auction Live Updates: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ ను పట్టించుకోని ఫ్రాంఛైజీలు అతని కనీస ధర రూ.2 కోట్లు గా ఉంది.
3:09 PM: IPL 2024 Auction Live Updates: టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.50 లక్షలకే కొనుగోలు చేసింది.
3:07 PM: IPL 2024 Auction Live Updates: సౌతాఫ్రికా వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్ రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కనీస ధరకే దక్కించుకుంది.
3:06 PM: IPL 2024 Auction Live Updates: ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ ను పట్టించుకోని ఫ్రాంఛైజీలు. అతని బేస్ ప్రైస్ రూ.1.5 కోట్లు.
3:02 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 వేలంలో మూడు, నాలుగు, ఐదు సెట్లలో వికెట్ కీపర్లు, పేస్ బౌలర్లు, స్పిన్నర్ల వేలం జరగనుంది.
2:57 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 వేలంలో ఇప్పటి వరకూ అమ్ముడుపోయిన టాప్ ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం. ప్యాట్ కమిన్స్ ను రూ.20.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇక డారిల్ మిచెల్ (చెన్నై సూపర్ కింగ్స్) రూ.14 కోట్లు, హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్) రూ.11.75 కోట్లు, శార్దూల్ ఠాకూర్ (చెన్నై సూపర్ కింగ్స్) రూ.4 కోట్లు, రచిన్ రవీంద్ర (సీఎస్కే) రూ.1.8 కోట్లు, రోవ్‌మన్ పావెల్ (రాజస్థాన్ రాయల్స్) రూ.7.4 కోట్లు, ట్రావిస్ హెడ్ (సన్ రైజర్స్) రూ.6.8 కోట్లు, హ్యారీ బ్రూక్ (ఢిల్లీ క్యాపిటల్స్) రూ.4 కోట్లు పలికారు.
2:42 PM: IPL 2024 Auction Live Updates: ఆల్ రౌండర్ల వేలం ముగిసింది. ఐపీఎల్ వేలంలో పది నిమిషాల బ్రేక్. రెండో సెట్లోనే ఫ్రాంఛైజీలన్నీ భారీగా ఖర్చు పెట్టాయి.
2:41 PM: IPL 2024 Auction Live Updates: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. అతని కనీస ధర రూ.2 కోట్లు కాగా.. చివరికి పంజాబ్ కింగ్స్ రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది.
2:38 PM: IPL 2024 Auction Live Updates: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ కోసం ఢిల్లీ క్యాపిట్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. అతని కనీస ధర రూ.కోటి. చివర్లో పంజాబ్ కింగ్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ పోటీగా వచ్చింది. దీంతో ధర పెరుగుతూ వెళ్లింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.
2:23 PM: IPL 2024 Auction Live Updates: టీమిండియా ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. మధ్యలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా పోటీ పడింది. అతని కనీస ధర రూ.2 కోట్లు కాగా.. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.11.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.
2:15 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 వేలంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ కొయెట్జీ కోసం ముంబై, చెన్నై, లక్నో పోటీ పడ్డాయి. చివరికి అతన్ని ముంబై ఇండియన్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది.
2:12 PM: IPL 2024 Auction Live Updates: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం చెన్నై, ముంబై పోటాపోటీ. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చి చేరింది. దీంతో ఫైట్ చెన్నై, ఆర్సీబీ మధ్య నడిచింది. చివర్లో సన్ రైజర్స్ కూడా పోటీ పడింది. ఆర్సీబీ, సన్ రైజర్స్ మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. చివరికి 20.5 కోట్ల రికార్డు ధరకు సన్ రైజర్స్ అతన్ని దక్కించుకుంది.
2:01 PM: IPL 2024 Auction Live Updates: ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ని రూ.50 లక్షలకే కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్.
2:00 PM: IPL 2024 Auction Live Updates: టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కోసం సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరికి చెన్నై అతన్ని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.
1:56 PM: IPL 2024 Auction Live Updates: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ. అతని బేస్ ప్రైస్ రూ.50 లక్షలుగా ఉంది. మధ్యలో పంజాబ్ కింగ్స్ కూడా వచ్చింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.8 కోట్లకు రచిన్ రవీంద్రను కొనుగోలు చేసింది.
1:51 PM: IPL 2024 Auction Live Updates: శ్రీలంక ఆల్ రౌండర్ వానిందు హసరంగను బేస్ ప్రైస్ రూ.1.5 కోట్లకే కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
1:50 PM: IPL 2024 Auction Live Updates: రెండో సెట్లో ఆల్ రౌండర్ల వేలం
1:40 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 వేలం తొలి సెట్ ముగిసింది. ఇందులో పావెల్ రూ.7.4 కోట్లు, ట్రావిస్ హెడ్ రూ.6.8 కోట్లు, హ్యారీ బ్రూక్ రూ.4 కోట్లకు అమ్ముడయ్యారు. ఇక స్టీవ్ స్మిత్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రైలీ రూసోలు అమ్ముడుపోలేదు.
1:37 PM: IPL 2024 Auction Live Updates: మనీష్ పాండే కూడా తొలి రౌండ్ లో అమ్ముడు పోలేదు. అతని కనీసం ధర రూ.50 లక్షలుగా ఉంది.
1:36 PM: IPL 2024 Auction Live Updates: ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను పట్టించుకోని ఫ్రాంఛైజీలు. అతని కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది.
1:34 PM: IPL 2024 Auction Live Updates: టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ ను ఎవరూ తీసుకోలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలుగా ఉంది.
1:33 PM: IPL 2024 Auction Live Updates: ట్రావిస్ హెడ్‌కు రూ.6.8 కోట్లు
ఆస్ట్రేలియా బ్యాటర్, వరల్డ్ కప్ ఫైనల్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ బిడ్ మొదలు పెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడింది. అయితే చివరికి సన్ రైజర్స్ రూ.6.8 కోట్లకు కొనుగోలు చేసింది.
1:23 PM: IPL 2024 Auction Live Updates: ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. అతని కనీస ధర రూ.2 కోట్లుగా ఉండగా.. క్యాపిటల్స్ అతన్ని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.
1:20 PM: IPL 2024 Auction Live Updates: సౌతాఫ్రికా బ్యాటర్ రైలీ రూసోను తీసుకోని ఫ్రాంఛైజీలు. అతని కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది.
1:18 PM: IPL 2024 Auction Live Updates: వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ కు రూ.7.4 కోట్లు. పావెల్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. చివరికి రాయల్స్ టీమ్ రూ.7.4 కోట్లకు కొనుగోలు చేసింది.
1:10 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ వేలాన్ని తొలిసారి ప్రత్యక్షంగా చూడటానికి అభిమానులకు అవకాశం ఇచ్చారు. కోకాకోలా అరెనాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో ప్రేక్షకులను అనుమతించారు.
1:07 PM: IPL 2024 Auction Live Updates: కోకా కోలా అరెనాలో బీసీసీఐ అధికారులు
ఐపీఎల్ 2024 వేలం కోసం బీసీసీఐ అధికారులు దుబాయ్ లోని కోకాకోలా అరెనాకు చేరుకున్నారు. మిగతా ఫ్రాంఛైజీలన్నీ కూడా అక్కడే ఉన్నాయి.
1:05 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ వేలంలో తొలి సెట్ ఎవరిదంటే?
ఐపీఎల్ 2024 వేలంలో తొలి సెట్ లో భాగంగా బ్యాటర్లను వేలం వేయనున్నారు. ఇందులో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, హ్యారీ బ్రూక్, మనీష్ పాండేలాంటి వాళ్లు ఉన్నారు.
12:07 PM: IPL 2024 Auction Live Updates: అత్యధిక ధర రికార్డు బ్రేక్ అవుతుందా?
ఈసారి ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికి ప్లేయర్ రికార్డు బ్రేక్ అవుతుందా? గతేడాది సామ్ కరన్ రూ.18.5 కోట్లతో కొత్త చరిత్ర సృష్టించాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఈసారి ఆ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కొయెట్జీలాంటి ప్లేయర్స్ వేలంలో ఉండటంతో ఆ రికార్డుకు ముప్పు పొంచి ఉందనే భావిస్తున్నారు.
12:02 PM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 వేలం ఎక్కడ చూడాలి?
ఐపీఎల్ 2024 వేలం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలం లైవ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో సినిమా యాప్ లేదా వెబ్‌సైట్ లో చూడొచ్చు.
11:30 AM: IPL 2024 Auction Live Updates: వేలానికి ముందు సన్ రైజర్స్ టీమ్ ఇలా..
అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), మార్కో యాన్సన్, రాహుల్ త్రిపాఠీ, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్‌హక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్
11:15 AM: IPL 2024 Auction Live Updates: వేలానికి ఈ స్టార్లు దూరం
ఐపీఎల్ 2024 వేలానికి కొందరు స్టార్ ప్లేయర్స్ చివరి నిమిషంలో దూరమయ్యారు. వీళ్లలో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఉన్నాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఉన్న అతడు.. ఈసారి మోకాలి సర్జరీ కారణంగా వేలానికి దూరమయ్యాడు. ఇక మరో ఇంగ్లండ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్, జో రూట్ కూడా వేలంలో పాల్గొనడం లేదు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ షకీబుల్ హసన్, తస్కిన్ దూరం కాగా.. కేదార్ జాదవ్, డేవిడ్ విల్లీ లాంటి ప్లేయర్స్ కూడా వేలంలో కనిపించడం లేదు.
11:00 AM: IPL 2024 Auction Live Updates: వేలంలో అందరి కళ్లూ వీరిపైనే..
ఐపీఎల్ 2024 వేలంలో కొందరు ప్లేయర్స్ భారీ ధర పలుకుతారన్న అంచనాలు ఉన్నాయి. వీళ్లలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ తోపాటు న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఉన్నారు. ఈసారి వేలంలో ఈ ప్లేయర్స్ కోసం బిడ్డింగ్ వార్ జరిగే అవకాశం ఉంది.
10:38 AM: IPL 2024 Auction Live Updates: ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే..
గుజరాత్ టైటన్స్ (రూ.38.15 కోట్లు), సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ.34 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.32.7 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ.31.4 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ.29.1 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.28.95 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.23.25 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.17.75 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ.14.5 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (రూ.13.15 కోట్లు)
10:30 AM: IPL 2024 Auction Live Updates: ఐపీఎల్ 2024 వేలం విశేషాలు
- మొత్తం 332 మంది ప్లేయర్స్ వేలంలో పాల్గొననున్నారు. అందులో 213 మంది ఇండియన్స్ కాగా.. 116 మంది విదేశీ ప్లేయర్స్
- మొత్తం 10 ఫ్రాంఛైజీల దగ్గర కలిపి రూ.262.95 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ దగ్గర అత్యధికంగా రూ.38.15 కోట్లు ఉన్నాయి.
- తొలిసారి ఓ మహిళ వేలం పాట పాడబోతున్నారు. ఆమె పేరు మల్లికా సాగర్
- మొత్తం 77 ఖాళీలను పది ఫ్రాంఛైజీలు ఫిల్ చేయనున్నాయి.
- 332 మంది ప్లేయర్స్ ను 19 సెట్లుగా విభజించి వేలం వేయనున్నారు.