తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sikandar Raza: రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన జింబాబ్వే ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. జింబాబ్వే వరల్డ్ రికార్డు

Sikandar Raza: రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన జింబాబ్వే ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. జింబాబ్వే వరల్డ్ రికార్డు

Hari Prasad S HT Telugu

23 October 2024, 20:51 IST

google News
    • Sikandar Raza: జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. బుధవారం (అక్టోబర్ 23) గాంబియాతో మ్యాచ్ లో ఈ వరల్డ్ రికార్డు నమోదైంది. జింబాబ్వే కూడా ఏకంగా 344 పరుగులతో రికార్డు క్రియేట్ చేసింది.
రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన జింబాబ్వే ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. జింబాబ్వే వరల్డ్ రికార్డు
రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన జింబాబ్వే ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. జింబాబ్వే వరల్డ్ రికార్డు (AFP)

రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన జింబాబ్వే ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. జింబాబ్వే వరల్డ్ రికార్డు

Sikandar Raza: సికందర్ రజా చరిత్ర తిరగరాశాడు. గాంబియాతో బుధవారం (అక్టోబర్ 23) జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో అతడు కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ లో భాగంగా గ్రూప్ బి మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. ఇన్నాళ్లూ రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో సెంచరీతో ఈ రికార్డును పంచుకున్నారు.

సికందర్ రజా వరల్డ్ రికార్డు

టీ20ల్లో ఓ టెస్ట్ ఆడే దేశం తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును ఇప్పుడు జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా నమోదు చేశాడు. గాంబియాతో మ్యాచ్ లో టాస్ గెలిచి జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. రజా కేవలం 43 బంతుల్లోనే 15 సిక్స్ లు, 7 ఫోర్లతో 133 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 33 బంతుల్లోనే సెంచరీతో చరిత్ర సృష్టించాడు.

గతంలో శ్రీలంకపై రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఇప్పుడా ఇద్దరి రికార్డును రజా బ్రేక్ చేశాడు. టెస్టు ఆడే దేశాల ప్లేయర్స్ లో అత్యంత వేగవంతమైన సెంచరీని రజా నమోదు చేయడం విశేషం. ఈ జాబితాలో నాలుగో స్థానంలో జాన్సన్ చార్లెస్ 39 బంతులతో, సంజూ శాంసన్ 40 బంతులతో ఉన్నారు.

అత్యధిక సిక్స్‌ల రికార్డు

ఈ ఇన్నింగ్స్ తో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ప్లేయర్స్ జాబితాలోనూ సికందర్ రజా చోటు సంపాదించాడు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది.

అతడు ఈ ఏడాది సైప్రస్ తో మ్యాచ్ లో ఏకంగా 18 సిక్స్ లు బాదాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన హజ్రతుల్లా జజాయ్ 16 సిక్స్ లతో రెండో స్థానంలో, ఫిన్ అలెన్ పాకిస్థాన్ పై 16 సిక్స్ లతో మూడో స్థానంలో ఉన్నారు. సికిందర్ రజా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక స్కోరు రికార్డు

జింబాబ్వే టీమ్ కూడా టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 344 పరుగులతో ఇన్నాళ్లూ నేపాల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. రజాకు తోడు మారుమని కూడా 19 బంతుల్లోనే 62 పరుగులు, బ్రియాన్ బెన్నెట్ 26 బంతుల్లో 50 రన్స్ చేయడంతో జింబాబ్వే 20 ఓవర్లలోనే 4 వికెట్లకు 344 రన్స్ చేసింది. ఇన్నాళ్లూ 314 పరుగులతో నేపాల్ తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. టీమిండియా 297 రన్స్ స్కోరుతో మూడో స్థానంలో ఉంది.

తదుపరి వ్యాసం