IND vs ZIM 5th T20: ముఖేష్ కుమార్ ధాటికి జింబాబ్వే విలవిల - ఐదో టీ20 లో టీమిండియా ఘన విజయం
IND vs ZIM 5th T20: ఐదో టీ20లో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌తో విజృంభించడంలో 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 125 పరుగులకే కుప్పకూలింది. 42 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలైంది.
IND vs ZIM 5th T20: పేసర్ ముఖేష్ కుమార్ జోరుతో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. జింబాబ్వేను 42 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఐదో టీ20లో బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, బౌలింగ్‌లో ముఖేష్ కుమార్ రాణించి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది.

125 రన్స్‌కు ఆలౌట్...
168 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన జింబాబ్వే ముఖేష్ కుమార్ ధాటికి 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఓవర్‌లోనే మద్వేర్‌ను డకౌట్ చేసి జింబాబ్వేకు షాకిచ్చాడు ముఖేష్ కుమార్. బన్నెట్ పది పరుగులకే ఔటైనా మరుమణి, మైయేర్స్ కలిసి జింబాబ్వేను ఆదుకున్నారు. మైయేర్స్ 34 పరుగులు , మరుమణి 27 రన్స్ చేశారు. మరుమణిని ఔట్ చేసి ఈ జోడిని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు.
పెవిలియన్‌కు క్యూ...
అక్కడి నుంచి జింబాబ్వే వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ రజాతో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరుకున్నారు. చివరలో ఫరాజ్ అక్రమ్ 13 బాల్స్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగులు చేసి జింబాబ్వే స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన ముఖేష్ కుమార్ 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. శివమ్ దూబేకు రెండు వికెట్లు దక్కాయి. అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, సుందర్ తలో వికెట్ తీసుకున్నారు.
సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ…
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 167 రన్స్ చేసింది. సంజూ శాంసన్ 45 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22 రన్స్ చేశారు.
4-1తో గెలుపు...
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకున్నది. తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించగా వరుసగా మిగిలిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శివమ్ దూబే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వాషింగ్టన్ సుందర్ అవార్డులను గెలుచుకున్నారు.