IPL 2024: క్రికెట్‌కు ధావన్ గుడ్‌బై? ఐపీఎల్ 2024 తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించనున్న టీమిండియా క్రికెటర్లు వీళ్లే?
03 May 2024, 9:43 IST
IPL 2024: ఈ ఐపీఎల్ తర్వాత శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మతో పాటు వృద్దిమాన్ సాహా ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శిఖర్ ధావన్
IPL 2024 ఐపీఎల్ తర్వాత కొంతమంది టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ ఐపీఎల్‌లో అనుకున్నంతగా రాణించలేకపోతున్న ఈ సీనియర్ క్రికెటర్లు తమ రిటైర్‌మెంట్ ప్రకటనకు ఇదే సరైన టైమ్ అనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రిటైర్‌మెంట్ ప్రకటించనున్న క్రికెటర్లుగా టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తోన్నాయి. వీరితో పాటు వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ కూడా ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి.
టీమిండియాకు దూరం...
ఈ నలుగురు క్రికెటర్లు టీమిండియా తరఫున ఆడి చాలా కాలమైంది. యంగ్ క్రికెటర్ల పోటీ కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన వీరు దేశవాళీ క్రికెట్ కూడా ఎక్కువగా ఆడటం లేదు. ఐపీఎల్‌లో రాణించి టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవాలని అనుకున్నా ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
ఈ నలుగురు సీనియర్ క్రికెటర్ల పేర్లను కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని సమాచారం. నేషనల్ టీమ్‌లో చోటు దక్కే అవకాశం లేదని క్లారిటీ రావడంతోనే తమ కెరీర్‌కు శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సామా రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లు చెబుతోన్నారు.ఈ సారి ఐపీఎల్‌లో వీరి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.
పంజాబ్ మేనేజ్‌మెంట్‌పై ధావన్ గుర్రు...
పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శిఖర్ ధావన్ ఈ సీజన్‌లో రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సామ్ కరన్‌కు మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. శిఖర్ గాయం నుంచి కోలుకున్నా మేనేజ్‌మెంట్ కావాలనే అతడిని పక్కనపెడుతోన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పంజాబ్ మేనేజ్‌మెంట్ తీరు నచ్చని ధావన్ ఈ ఫ్రాంచైజ్‌కు గుడ్‌బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పంజాబ్ తరఫున ధావన్‌కు ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. టీమ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడంతో కెరీర్‌కు ధావన్ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
భువనేశ్వర్ కూడా....
భువనేశ్వర్ కుమార్ కూడా జాతీయ జట్టు తరఫున ఆడి రెండేళ్లు దాటిపోయింది. ఒకప్పుడు టీమిండియా ప్రధాన పేసర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు భువనేశ్వర్. కానీ ఇప్పుడు సెలెక్షన్ కోసం అతడి పేరును కూడా పరిశీలించడం లేదు.
2022 టీ20 వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమైన అతడు నేషనల్ టీమ్‌లో ప్లేస్ కోల్పోయాడు. జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ దారులన్నీ మూసుకుపోవడంతో అతడి కష్టం ఫలించలేదు. ఐపీఎల్ 2024లో పది మ్యాచులు ఆడిన భువనేశ్వర్ కేవలం ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి.
ఇషాంత్ ఆరు వికెట్లు...
భువనేశ్వర్ తో పాటు ఇషాంత్ శర్మ కూడా టీమిండియాలో కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్య వహిస్తోన్న ఇషాంత్ శర్మ ఎనిమిది మ్యాచుల్లో ఆరు వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో మునుపటి మెరుపులు లేవు. ప్రతిభ ఉండి కూడా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేక అన్‌లక్కీ ప్లేయర్‌గా వృద్ధిమాన్ సాహా నిలిచాడు.
ధోనీ కీపర్‌గా టీమిండియాలో పర్మినెంట్‌గా సెటిల్ కావడంతో సాహా కెరీర్‌కు పుల్‌స్టాప్ పడింది. టీమిండియాలో ఒకటి రెండు అవకాశాలు దక్కినా వాటిలో విఫలం కావడం, ఐపీఎల్‌లో నిలకడ లేమి వృద్ధిమాన్ సాహా కెరీర్‌కు అడ్డంకిగా మారాయి. అటు జాతీయ జట్టుతో ఇటు ఐపీఎల్‌లో నెక్స్ట్ సీజన్‌లో అవకాశాలు రావడం అనుమానంగానే ఉండటంతో సాహాతో పాటు ఇషాంత్ కూడా కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.