Asia Cup 2022: ఆసియా కప్ 2022 హయ్యెస్ట్ వికెట్ టేకర్ భువనేశ్వర్ – హయ్యెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ కోహ్లి
Asia Cup 2022: ఆసియా కప్ 2022లో హయ్యెస్ట్ యావరేజ్ కలిగిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లి నిలిచాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరంటే...
Asia Cup 2022: ఆసియా 2022 క్రికెట్ సంబురం ముగిసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన శ్రీలంక టైటిల్ గెలుచుకొని క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 23 పరుగులు తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 170 పరుగులు చేయగా పాకిస్థాన్ 147 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఈ ఆసియా కప్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు.
రిజ్వాన్ 281 రన్స్ చేశాడు. అతడి తర్వాతి స్థానంలో 276 రన్స్ తో విరాట్ కోహ్లి (Virat kohli) సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన ప్లేయర్‌గా కోహ్లి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. 92 యావరేజ్, 147 స్ట్రైక్ రేట్‌తో కోహ్లి 276 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్ 2022లో సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ కోహ్లి కావడం గమనార్హం.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్(bhuvneshwar kumar) నిలిచాడు. భువనేశ్వర్ మొత్తం 11 వికెట్లు తీశాడు. ఈ ఆసియా కప్‌లో ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్న ఏకైక బౌలర్ అతడే కావడం గమనార్హం. బెస్ట్ బౌలింగ్ కూడా అతడిదే కావడం గమనార్హం. ఆప్ఘనిస్తాన్‌పై మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి నాలుగు రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రహ్మనుల్లా గుర్భాజ్, అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రిజ్వాన్ నిలిచాడు.