తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ravi Bishnoi Catch: ఐపీఎల్ బెస్ట్ క్యాచ్‌లలో ఇదీ ఒకటి.. కళ్లు చెదిరేలా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన రవి బిష్ణోయ్

Ravi Bishnoi Catch: ఐపీఎల్ బెస్ట్ క్యాచ్‌లలో ఇదీ ఒకటి.. కళ్లు చెదిరేలా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన రవి బిష్ణోయ్

Hari Prasad S HT Telugu

08 April 2024, 11:18 IST

google News
    • Ravi Bishnoi Catch: ఐపీఎల్ 2024లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ రవి బిష్ణోయ్. ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్ లలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.
ఐపీఎల్ బెస్ట్ క్యాచ్‌లలో ఇదీ ఒకటి.. కళ్లు చెదిరేలా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన రవి బిష్ణోయ్
ఐపీఎల్ బెస్ట్ క్యాచ్‌లలో ఇదీ ఒకటి.. కళ్లు చెదిరేలా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన రవి బిష్ణోయ్

ఐపీఎల్ బెస్ట్ క్యాచ్‌లలో ఇదీ ఒకటి.. కళ్లు చెదిరేలా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన రవి బిష్ణోయ్

Ravi Bishnoi Catch: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్స్ రవి బిష్ణోయ్ అందుకున్న క్యాచ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అతడు తన బౌలింగ్ లోనే టైటన్స్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ను గాల్లోకి డైవ్ చేస్తూ అందుకున్నాడు. దీనిని క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటూ స్టార్ స్పోర్ట్స్ వీడియో షేర్ చేసింది.

రవి బిష్ణోయ్ డైవింగ్ క్యాచ్

గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో బౌలింగ్ లో రాణించిన రవి బిష్ణోయ్ క్యాచ్ తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 2 ఓవర్లు వేసే అవకాశం అతనికి దక్కింది. ఇందులో కేవలం 8 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ వికెట్ కూడా తన కళ్లు చెదిరే క్యాచ్ తోనే కావడం విశేషం. 23 ఏళ్ల బిష్ణోయ్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతికి ఈ అద్భుతాన్ని క్రియేట్ చేశాడు.

అతని బౌలింగ్ లో విలియమ్సన్ కాస్త ముందుకు వచ్చి నేరుగా బంతిని గాల్లోకి లేపాడు. అయితే తన ఫాలోత్రూలోనే బిష్ణోయ్ కళ్లు మూసి తెరిచేలోపు తన కుడివైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్యాచ్ ఆఫ్ ద టోర్నీగా ప్యాన్స్ అభివర్ణిస్తున్నారు.

రవి బిష్ణోయ్ ఓ పక్షి అంటూ ఓ అభిమాని అనడం విశేషం. నిజానికి ఈ వికెటే మ్యాచ్ ను మలుపు తిప్పింది. విలియమ్సన్ ఔటైన తర్వాత గుజరాత్ టైటన్స్ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో ఎల్ఎస్‌జీ బౌలర్ యశ్ ఠాకూర్ 5 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో ఇదే తొలి 5 వికెట్ల ప్రదర్శన. దీంతో టైటన్స్ టీమ్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది.

33 పరుగులతో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల టేబుల్లో మూడోస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. మార్కస్ స్టాయినిస్ (58) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్

ఆదివారం (ఏప్రిల్ 7) జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ మారిపోయింది. సీజన్లో తొలి విజయంతో ముంబై ఇండియన్స్ 8వ స్థానంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానానికి పడిపోయింది. ఇక టాప్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కొనసాగుతున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి.

ఐదు నుంచి పది స్థానాల వరకు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. సోమవారం (ఏప్రిల్ 8) చెన్నై, కోల్‌కతా మ్యాచ్ తో టేబుల్లో మరిన్ని మార్పులు జరగనున్నాయి.

తదుపరి వ్యాసం