తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan Cricket Team: పాకిస్థాన్ ప్లేయర్స్‌కు బంపర్ ఆఫర్.. వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కు లక్ష డాలర్లు

Pakistan Cricket Team: పాకిస్థాన్ ప్లేయర్స్‌కు బంపర్ ఆఫర్.. వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కు లక్ష డాలర్లు

Hari Prasad S HT Telugu

06 May 2024, 8:09 IST

google News
  • Pakistan Cricket Team: పాకిస్థాన్ ప్లేయర్స్ కు అక్కడి క్రికెట్ బోర్డు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక వేళ తమ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కొక్కరికి లక్ష డాలర్లు ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేసింది.

పాకిస్థాన్ ప్లేయర్స్‌కు బంపర్ ఆఫర్.. వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కు లక్ష డాలర్లు
పాకిస్థాన్ ప్లేయర్స్‌కు బంపర్ ఆఫర్.. వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కు లక్ష డాలర్లు (AFP)

పాకిస్థాన్ ప్లేయర్స్‌కు బంపర్ ఆఫర్.. వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కు లక్ష డాలర్లు

Pakistan Cricket Team: స్వదేశంలో సెకండ్ రేట్ న్యూజిలాండ్ టీమ్ పై కూడా టీ20 సిరీస్ గెలవలేకపోయినా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు అక్కడి క్రికెట్ బోర్డు ఓ ఆఫర్ ఇచ్చింది. రాబోయే టీ20 వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కో ప్లేయర్ కు లక్ష డాలర్లు (పాకిస్థాన్ కరెన్సీలో రూ.2.77 కోట్లు) ఇవ్వనున్నట్లు చెప్పింది. జూన్ 2 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికాల్లో ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్ టీమ్‌కు ఆఫర్

ఆదివారం (మే 5) పాకిస్థాన్ ప్లేయర్స్ ఐర్లాండ్, ఇంగ్లండ్ లలో టీ20 సిరీస్ లు ఆడేందుకు బయలుదేరింది. అంతకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వి ప్లేయర్స్ తో రెండు గంటల పాటు సమావేశమయ్యాడు. ఈ సందర్భంగానే ప్లేయర్స్ తోనే ఈ ప్రత్యేక రివార్డు ఇస్తామని అతడు చెప్పాడు. అయితే ట్రోఫీ గెలవడం కంటే ఈ ప్రైజ్ మనీకి పెద్దగా ప్రాధాన్యత లేదని అన్నాడు.

ఈసారి పాకిస్థాన్ కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందన్న నమ్మకంతో నఖ్వి ఉన్నాడు. ఎవరి గురించి పట్టించుకోకుండా పాకిస్థాన్ కోసమే ఆడాలని, అప్పుడు విజయం మీ వెంట వస్తుందని ప్లేయర్స్ కు పిలుపునిచ్చాడు. ఈసారి వరల్డ్ కప్ లో స్టార్ పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది రాణిస్తాడన్న నమ్మకం వ్యక్తం చేశాడు. దేశం మొత్తం ఎన్నో అంచనాలతో ఉందని, వాటిని అందుకోవాల్సిన అవసరం ఉందని ప్లేయర్స్ తో నఖ్వి అన్నాడు.

ఈ సమావేవంలోనే వ్యక్తిగత మైలురాళ్లు అందుకున్న పాకిస్థాన్ ప్లేయర్స్ కు ప్రత్యేకమైన జెర్సీలు అందజేశారు. వికెట్ కీపర్ రిజ్వాన్ టీ20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేయడం, నసీమ్ షా 100 వికెట్లు తీయడంతో వారికి ఈ టీషర్టులు అందాయి.

పాకిస్థాన్‌కు అంత సీన్ ఉందా?

పాకిస్థాన్ టీమ్ గతేడాది వన్డే వరల్డ్ కప్ నుంచి పూర్తిగా గాడి తప్పింది. ఇండియాలో జరిగిన ఈ మెగా టోర్నీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకున్నాడు. పేస్ బౌలర్ షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ అప్పగించినా.. వరుస ఓటములు తప్పకపోవడంతో మళ్లీ బాబర్ కే పట్టాలు అప్పగించారు. అయితే ఈ మధ్యే సెకండ్ రేట్ న్యూజిలాండ్ టీమ్ ను కూడా స్వదేశంలో ఆ టీమ్ ఓడించలేకపోయింది.

ఐదు టీ20ల సిరీస్ ను కష్టమ్మీద 2-2తో డ్రా చేయగలిగింది. ఇప్పుడు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు వెళ్తోంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆ టీమ్ ఆడే చివరి సిరీస్ లు ఇవే. వరల్డ్ కప్ లో భాగంగా ఇండియాతో జూన్ 9న పాకిస్థాన్ కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్ లో ప్రత్యేకంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

అయితే 2022లో కూడా పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పాకిస్థాన్ టీమ్ ఫైనల్ చేరి ఆశ్చర్య పరిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోయింది. దీంతో ఈసారి ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇండియాతోపాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏలతో కలిసి గ్రూప్ ఎలో పాకిస్థాన్ ఉంది.

తదుపరి వ్యాసం