తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Ipl 2025 Players List: ఐపీఎల్ 2025 వేలంలో ముంబయి ఇండియన్స్ వింత పోకడ.. ఒక్కడిని కొని ముగ్గురిపై ఆర్టీఎం

MI IPL 2025 Players List: ఐపీఎల్ 2025 వేలంలో ముంబయి ఇండియన్స్ వింత పోకడ.. ఒక్కడిని కొని ముగ్గురిపై ఆర్టీఎం

Galeti Rajendra HT Telugu

25 November 2024, 8:00 IST

google News
  • Mumbai Indians IPL 2025 Team:  ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ వద్ద చాలినంత డబ్బు ఉన్నా.. ఆదివారం వేలంలో పెద్దగా ఖర్చు చేయలేదు. కేవలం ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ కోసం గట్టిగా పోటీపడింది. మిగిలిన ప్లేయర్ల కోసం ఆర్టీఎం కార్డు ప్రయోగం కోసం ఎదురుచూసింది. దాంతో..? 

ముంబయి ఇండియన్స్ జట్టులోకి మళ్లీ ట్రెంట్ బౌల్ట్
ముంబయి ఇండియన్స్ జట్టులోకి మళ్లీ ట్రెంట్ బౌల్ట్ (PTI)

ముంబయి ఇండియన్స్ జట్టులోకి మళ్లీ ట్రెంట్ బౌల్ట్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆదివారం ముంబయి ఇండియన్స్ చాలా సేఫ్ గేమ్ ఆడింది. టాప్ ప్లేయర్లు వేలంలోకి వచ్చినా.. పెద్దగా పట్టించుకోని ముంబయి ఇండియన్స్ చేతిలో చాలినంత డబ్బు ఉన్నా ఉదాసీనంగా వ్యవహరించింది. రోజు మొత్తంలో కేవలం ట్రెంట్ బౌల్ట్ కోసం మాత్రమే సీరియస్‌గా ట్రై చేసింది. దాంతో గతంలో ముంబయి టీమ్‌కి ఆడిన చాలా మంది ప్లేయర్లని మిగిలిన ఫ్రాంఛైజీలు ఎగరేసుకుపోయింది. ఇందులో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అతడ్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.11.25 కోట్లకి ఎత్తుకెళ్లిపోయింది.

న్యూజిలాండ్‌కి చెందిన ట్రెంట్ బౌల్ట్ రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి రాగా.. అతడి కోసం ముంబయి రూ.12.5 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే కుడిచేతి వాటం పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీమ్‌లో ఉండటంతో లెప్ట్ హ్యాండర్, పవర్ ప్లేలో వికెట్లు తీయగల బౌల్ట్ చేరికతో ఆ జట్టు పేస్ విభాగం బలోపేతమైంది. వేలంలో ఇంకా ముగ్గురుని ముంబయి కొనుగోలు చేసింది. కానీ.. ఆ ముగ్గురినీ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు వాడే దక్కించుకోవడం గమనార్హం.

నమన్ ధీర్ను కోసం ఢిల్లీ, రాజస్థాన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ.. ఆర్టీఎం ప్రయోగించడంతో ముంబయి సొంతమయ్యాడు. 2024లో ముంబయి ఇండియన్స్ జట్టుకి ఆడినధీర్ను గత ఏడాది మినీ వేలంలో రూ.20 లక్షలకే కొనుగోలు చేయడం గమనార్హం. గత ఏడాది 177.21 స్ట్రైక్ రేట్‌తో ఈ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.

ఐపీఎల్ 2025 వేలం ద్వారా ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసిన ప్లేయర్ల్స్

  • ట్రెంట్ బౌల్ట్ (రూ.12.5 కోట్లు),
  • నమన్ ధీర్ను రూ.5.25 కోట్లు
  • రాబిన్ మింజ్ను రూ.65 లక్షలు
  • కరణ్ శర్మ రూ.50 లక్షలు

ముంబయి ఇండియన్స్ రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు

  • జస్‌ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు)
  • సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
  • హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు)
  • రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
  • తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆదివారం రూ.18.90 కోట్లని మాత్రమే ముంబయి ఇండియన్స్ ఖర్చు చేసింది. అలానే రిటెన్షన్ కోసం ఇప్పటికే రూ.75 కోట్లని ఖర్చు చేయగా.. ఇక ఆ ఫ్రాంఛైజీ వద్ద మిగిలింది రూ.26.10 కోట్లు మాత్రమే.

తదుపరి వ్యాసం