తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Ipl: ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ గెల‌వ‌ని మూడు అవార్డులు ఏవంటే?

Csk IPL: ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ గెల‌వ‌ని మూడు అవార్డులు ఏవంటే?

30 May 2024, 11:41 IST

google News
  • Csk IPL: ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను స‌క్సెస్‌ఫుల్ టీమ్‌గా ఫ్యాన్స్ చెబుతుంటారు. చెన్నై ఇప్ప‌టివ‌ర‌కు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కానీ ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ మూడు అవార్డులు ఒక్క‌టంటే ఒక్క‌సారి కూడా సీఎస్‌కే ప్లేయ‌ర్స్ గెల‌వ‌లేక‌పోయారు. ఆ అవార్డులు ఏవంటే?

చెన్నై సూప‌ర్ కింగ్స్‌
చెన్నై సూప‌ర్ కింగ్స్‌

చెన్నై సూప‌ర్ కింగ్స్‌

Csk IPL: ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను స‌క్సెస్‌ఫుల్ టీమ్‌గా క్రికెట్ ఫ్యాన్స్ అభివ‌రిస్తుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు ధోనీ సార‌థ్యంలో సీఎస్‌కే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న‌ది. 2010, 2011, 2018తో పాటు 2020, 2023ల‌లో ఐపీఎల్ విజేత‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ నిలిచింది. అత్య‌ధిక సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన జ‌ట్టుగా చ‌రిత్ర‌ను సృష్టించింది.

లీగ్ ద‌శ‌లోనే ఇంటిముఖం...

2024 సీజ‌న్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలో దిగిన చెన్నై లీగ్ ద‌శ‌లోనే ఇంటిముఖం ప‌ట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలిచినా ర‌న్‌రేట్‌లో వెనుక‌బ‌డి అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది.

ఐపీఎల్ లీగ్‌లో సీఎస్‌కే ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ ఎవ‌రూ బ్రేక్ చేయాల‌ని రికార్డుల‌ను నెల‌కొల్పింది. ఈ లీగ్‌లో ప‌ర్పుల్, ఆరెంజ్ క్యాప్‌తో పాలు ప‌లు అవార్డుల‌ను సీఎస్‌కే ప్లేయ‌ర్స్ అందుకున్నారు.

మూడు అవార్డులు మాత్రం...

కానీ ఓ మూడు అవార్డులు మాత్రం చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు గెలుచుకోలేక‌పోయారు. ప‌దిహేడు సీజ‌న్స్‌లో ఒక్క‌సారి కూడా చెన్నైకి ఈ అవార్డులు రాలేదు. ఆ అవార్డులు ఏవంటే?

మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్‌...

ఐపీఎల్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్ అవార్డుగా పిలుస్తుంటారు. ఈ అవార్డు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా సీఎస్‌కే ప్లేయ‌ర్స్ గెల‌వ‌లేదు. సీఎస్‌కే విన్న‌ర్‌గా నిలిచిన సీజ‌న్స్‌లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్ అవార్డ్ ఇత‌ర టీమ్‌ల ప్లేయ‌ర్స్‌కు ద‌క్కింది. 2024 సీజ‌న్‌లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్ అవార్డును సునీల్ న‌రైన్ సొంతం చేసుకున్నాడు. మూడు సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్న క్రికెట‌ర్‌గా సునీల్ న‌రైన్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

మోస్ట్ సిక్సెస్ అవార్డు...

ఐపీఎల్ హిస్ట‌రీలో ఒక్క‌టంటే ఒక్క‌సారి కూడా మోస్ట్ సిక్సెస్ అవార్డును సీఎస్‌కే గెల‌వ‌లేక‌పోయింది. ఈ అవార్డును ఆర్‌సీబీ, పంజాబ్ ప్లేయ‌ర్లే ఎక్కువ సార్లు సొంతం చేసుకున్నారు. 2024 సీజ‌న్‌లో మోస్ట్ సిక్సెస్ ప్లేయ‌ర్ అవార్డును స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ ద‌క్కించుకున్నాడు. ఈ సీజ‌న్‌లో అభిషేక్ శ‌ర్మ న‌ల‌భై రెండు సిక్సులు కొట్టాడు.

హ‌య్యెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు...

ఐపీఎల్‌లో హ‌య్యెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డును 2018 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డును కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క చెన్నై ప్లేయ‌ర్‌కు ద‌క్క‌లేదు. కోల్‌క‌తా, ఆర్‌సీబీ, ఢిల్లీ అట‌గాళ్లే ఎక్కువ‌గా హ‌య్యెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డును గెలుచుకున్నారు. 2024 ఐపీఎల్‌లో హ‌య్యెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు ఢిల్లీ క్యాపిట‌ల్స్ క్రికెట‌ర్ జేక్ ఫ్రెజ‌ర్ మెక్ గార్క్‌కు ద‌క్కింది.

ధోనీ స్థానంలో...

కాగా ఈ ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఐపీఎల్‌కు ముందు ధోనీ కెప్టెన్సీ బాధ్య‌తల నుంచి త‌ప్పుకున్నాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అద్భుత ఆట‌తీరుతో రుతురాజ్ అద‌ర‌గొట్టాడు. ఈ సీజ‌న్‌లో 14 మ్యాచుల్లో 583 ర‌న్స్ చేశాడు.

కాగా ధోనీకి ఆట‌గాడిగా ఇదే చివ‌రి సీజ‌న్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. నెక్స్ట్ సీజ‌న్ నుంచి చెన్నైకి మెంట‌ర్‌గా మాత్ర‌మే ధోనీ వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం