Mayank Yadav : టీ20 వరల్డ్ కప్‌కు మయాంక్ యాదవ్ ఫిక్స్! ఆ స్టార్ బౌలర్ స్థానంలో..
08 April 2024, 16:36 IST
- Mayank Yadav IPL 2024 : ఐపీఎల్ 2024 సెన్సెషన్ మయాంక్ యాదవ్‌కు టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో చోటు దక్కుతుందా? అంటే.. కచ్చితంగా ఇవ్వాలని అంటున్నారు మాజీ సెలక్టర్. అతను అర్హుడని చెబుతున్నారు.
మయాంక్ యాదవ్‌కి టీ20 వరల్డ్ కప్‌లో చోటు ఫిక్స్!
Mayank Yadav in T20 world cup : ఐపీఎల్ 2024లో తన స్పీడ్ బౌలింగ్‌తో సంచలనం సృష్టించి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు మయాంక్ యాదవ్. అతనిపై దిగ్గజ ప్లేయర్ల నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకు.. అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇంకొన్ని నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కి ముందు.. మయాంక్ యాదవ్ ఇలాంటి ప్రదర్శన చేయడం అతనికి ప్లస్‌గా మారింది. జూన్ 1న వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లే టీమిండియా జట్టులో అతనికి చోటు దక్కుతుందని అందరు అంచనా వేస్తున్నారు.
టీమిండియా జట్టులో మయాంక్ యాదవ్..!
మయాంక్ యాదవ్ వయస్సు 21ఏళ్లు. ఇప్పటివరకు 17 లిస్ట్ ఏ, 13 టీ20లు, 1 ఫస్ట్ క్లాస్ గేమ్ ఆడాడు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మయాంక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెలరేగాడు. ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ బాల్ వేసి అందరిని ఆకర్షించాడు. ఫలితంగా.. టీ20 వరల్డ్ కప్ 15 మెంబర్ టీమ్‌కి బలమైన పోటీ ఇస్తున్నాడు.
ఇక బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ చెప్పింది నిజమే అయితే.. గాయంతో బాధపడుతున్న మహమ్మద్ షమీ స్థానంలో టీ20 వరల్డ్ కప్‌కు మయాంక్ యాదవ్‌ని ఎంపికి చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మయాంక్ యాదవ్‌తో కూడిన బౌలింగ్ లైనప్ ఇండియా సొంతం అవుతుంది.
Mayank Yadav IPL 2024 : "వరల్డ్ కప్ వేరే ఫార్మాట్ అయ్యుంటే.. నేను ఇలా ఆలోచించేవాడిని కాదు. కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన తర్వాతే.. మయాంక్ యాదవ్ గురించి ఆలోచించేవాడిని. కానీ మన టాలెంట్‌ని చూపించుకునేందుకు ఐపీఎల్ ఒక గొప్ప వేదిక. పైగా.. వరల్డ్ కప్ జరుగుతున్నది టీ20 ఫార్మాట్లో. మయాంక్ యాదవ్ ఇప్పటికే ఫేమస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు," అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఎంఎస్కే ప్రసాద్.
"మయాంక్ బౌలింగ్‌ని, పేస్‌ని ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటే.. అతను కచ్చితంగా ఉపయోగపడతాడు. టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. మహమ్మద్ షమీ గాయంతో టీ20 వరల్డ్ కప్ ఆడలేడు. అంటే.. బుమ్రా, సిరాజ్‌తో పాటు మూడో బౌలర్ గురించి సెలక్టర్లు ఆలోచించాలి. పేస్, అక్యురసీ మంచిగా ఉన్న వ్యక్తికి.. టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లే టీమిండియా జట్టులో చోటు దక్కాలి," అని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
T20 World Cup Team India squad : "కన్సిస్టెంట్గా బౌలింగ్ చేయడమే కాదు. అక్యురసీతో కూడా బౌలింగ్ చేయాలి. మయాంక్ విషయంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో మనం ఇది చూశాము. అతడి పేస్‌ని ఆడటానికి బ్యాటర్లు కష్టపడ్డారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో కూడా తన ప్రతిభను చాటాడు. పిచ్.. బౌలింగ్‌కి ఇంకా అనుకూలిస్తే.. మయాంక్ యాదవ్ బాల్స్‌ని ఎదుర్కోవడం కష్టమే. ఛేంజ్ ఆఫ్ పేస్ విషయంలో అతను అద్భుతం చేస్తున్నాడు. అందుకే.. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటుకు అతను పోటీ ఇస్తాడు," అని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు.