తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Richest Indian Players: ఐపీఎల్లో రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే.. రోహిత్, కోహ్లి ఎంత సంపాదిస్తున్నారో చూడండి

IPL Richest Indian Players: ఐపీఎల్లో రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే.. రోహిత్, కోహ్లి ఎంత సంపాదిస్తున్నారో చూడండి

Hari Prasad S HT Telugu

24 April 2024, 16:12 IST

google News
    • IPL Richest Indian Players: ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెటర్ల సంపాదన గణనీయంగా పెరిగింది. మరి ఈ ఏడాది ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్టుల ద్వారా ఎక్కువ మొత్తం సంపాదిస్తున్న టాప్ 10 ఇండియన్ క్రికెటర్లు ఎవరో ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్లో రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే.. రోహిత్, కోహ్లి ఎంత సంపాదిస్తున్నారో చూడండి
ఐపీఎల్లో రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే.. రోహిత్, కోహ్లి ఎంత సంపాదిస్తున్నారో చూడండి

ఐపీఎల్లో రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే.. రోహిత్, కోహ్లి ఎంత సంపాదిస్తున్నారో చూడండి

IPL Richest Indian Players: ఐపీఎల్లో మొదటి ఏడాది అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రూ.6 కోట్లతో ధోనీ రికార్డు క్రియేట్ చేశాడు. కానీ తర్వాత ఈ మొత్తం భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న ఇండియన్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కావడం విశేషం.

అతనికి లక్నో సూపర్ జెయింట్స్ రూ.17 కోట్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జీతం, బీసీసీఐ కాంట్రాక్టు కలిపి ఎక్కువ మొత్తం సంపాదిస్తున్న ఇండియన్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం.

సంపాదనలో టాప్ 10 ఇండియన్ క్రికెటర్స్

కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్)

బీసీసీఐ కాంట్రాక్టు: రూ.5 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.17 కోట్లు

రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)

బీసీసీఐ కాంట్రాక్టు: రూ.7 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.16 కోట్లు

రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్)

బీసీసీఐ కాంట్రాక్టు: రూ.3 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.16 కోట్లు

రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్)

బీసీసీఐ జీతం: రూ.7 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.16 కోట్లు

విరాట్ కోహ్లి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

బీసీసీఐ జీతం: రూ.7 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.15.25 కోట్లు

హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)

బీసీసీఐ జీతం: రూ.5 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.15 కోట్లు

జస్‌ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)

బీసీసీఐ జీతం: రూ.7 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.12 కోట్లు

శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్)

బీసీసీఐ జీతం: రూ.5 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.12.25 కోట్లు

శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటన్స్)

బీసీసీఐ జీతం: రూ.5 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.8 కోట్లు

సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్)

బీసీసీఐ జీతం: రూ.3 కోట్లు

ఐపీఎల్ జీతం: రూ.8 కోట్లు

సంపదలో సచిన్ టాప్

ఇక ఓవరాల్ క్రికెటర్ల సంపద విషయానికి వస్తే రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. అతని మొత్తం సంపద విలువ 16.5 కోట్ల డాలర్లుగా ఉంది. ఆ తర్వాత ధోనీ 12.7 కోట్ల డాలర్లు, విరాట్ కోహ్లి 12.2 కోట్ల డాలర్లతో ఉన్నారు. క్రికెట్ ఆడితే వచ్చేదాని కన్నా ఈ క్రికెటర్లు బయట ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఎక్కువ సంపాదించుకున్నారు.

ఐపీఎల్ ముందు వరకూ క్రికెటర్ల సంపాదన ఈ స్థాయిలో ఉండేది కాదన్నది మాత్రం నిజం. ఈ మెగా లీగ్ వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలు కూడా పెరిగాయి. ఏడాదంతా అంతర్జాతీయ క్రికెట్ ఆడినా రాని ఆదాయం.. ఈ రెండు నెలల్లోనే మన క్రికెటర్లు సంపాదించేస్తున్నారు. దీంతో యువ క్రికెటర్లంతా టెస్ట్ క్రికెట్ ను కూడా కాదని ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.

డొమెస్టిక్ క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తున్న యువ క్రికెటర్లు ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అంతేకాదు ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి వెళ్లడానికి కూడా ఈ ఐపీఎల్ మంచి మార్గంగా మారింది.

తదుపరి వ్యాసం