తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా రెండో విజయంతో పాయింట్ల టేబుల్ మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్
- IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ను వరుసగా రెండోసారి ఓడించి పాయింట్ల టేబుల్లో టాప్ 4లోకి దూసుకొచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. 39 మ్యాచ్ ల తర్వాత ఏ టీమ్ ఏ స్థానంలో ఉందో ఒకసారి చూద్దాం.
- IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ను వరుసగా రెండోసారి ఓడించి పాయింట్ల టేబుల్లో టాప్ 4లోకి దూసుకొచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. 39 మ్యాచ్ ల తర్వాత ఏ టీమ్ ఏ స్థానంలో ఉందో ఒకసారి చూద్దాం.
(1 / 6)
IPL 2024 Points Table: మొన్న కేఎల్ రాహుల్, డికాక్.. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్.. నాలుగు రోజుల వ్యవధిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను రెండుసార్లు ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ సంచలనం సృష్టించింది. ఈ విజయంతో లక్నో 8 మ్యాచ్ లలో 5 విజయాలు, 10 పాయింట్లతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో సమానంగా నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా ఉండటంతో ఆ టీమ్స్ 2, 3 స్థానాల్లో ఉండగా.. లక్నో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం లక్నో నెట్ రన్ రేట్ 0.148గా ఉంది.
(2 / 6)
IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో వరుసగా రెండు ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 4 నుంచి వెళ్లిపోయింది. ప్లేఆఫ్స్ అవకాశాలకు ఇప్పటికిప్పుడే దెబ్బ పడకపోయినా.. 8 మ్యాచ్ లలో కేవలం 8 పాయింట్లతో ఆ టీమ్ ఐదో స్థానంలో ఉంది. ఆ టీమ్ 4 గెలిచి, 4 ఓడిపోయింది. గుజరాత్ కూడా 8 పాయింట్లతోనే ఉన్నా.. ఆ టీమ్ నెట్ రన్ రేట్ (-1.055) నెగటివ్ గా ఉండటంతో జీటీ 6వ స్థానంలో ఉంది.
(3 / 6)
IPL 2024 Points Table: చెన్నైసూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఫలితం ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో టాప్ 3పై ఎలాంటి ప్రభావం చూపలేదు. తొలి స్థానంలోరాజస్థాన్ రాయల్స్ కొనసాగుతోంది. ఆ టీమ్ 8 మ్యాచ్ లలో ఏడు విజయాలు, 14 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇక రెండు, మూడు స్థానాల్లో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ ఉన్నాయి.
(4 / 6)
IPL 2024 Points Table: కోల్‌కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్ లలో ఐదు విజయాలు, 10 పాయింట్లు, 1.206 నెట్ రన్ రేట్ తో రెండోస్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 7 మ్యాచ్ లలో 5 విజయాలు, 10 పాయింట్లు, 0.914 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది.
(5 / 6)
IPL 2024 Points Table: ఇక ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్ లలో 3 విజయాలు, 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 పాయింట్లతోనే ఉన్నా.. నెట్ రన్ రేట్ విషయంలో ముంబై కంటే వెనుకబడి 8వ స్థానంలో కొనసాగుతోంది.
ఇతర గ్యాలరీలు