IND vs BAN 2nd Test: ఈరోజు నుంచే రెండో టెస్టు, మ్యాచ్ లైవ్‌ను ఎక్కడ చూడొచ్చు, టైమింగ్స్, టీమ్స్ వివరాలు ఇవే!
27 September 2024, 5:53 IST
IND vs BAN 2nd Test Updates: బంగ్లాదేశ్‌ని చెపాక్ టెస్టులో చిత్తుగా ఓడించిన టీమిండియా.. ఈరోజు కాన్పూర్ వేదికగా జరిగే టెస్టులోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ కనీసం పరువు నిలుపుకునేలా గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది.
ఈరోజు నుంచి కాన్పూర్ టెస్టు
IND vs BAN Test 2024: భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా ఈరోజు (సెప్టెంబరు 28) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ జట్టు.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
చెపాక్ టెస్టులో తేలిపోయిన బంగ్లాదేశ్ టీమ్.. కనీసం రెండో టెస్టులోనైనా భారత్ జట్టుకి గట్టిపోటీనివ్వాలని చూస్తోంది. మరోవైపు టీమిండియా కూడా అదే జోరుని కొనసాగించి బంగ్లాదేశ్‌ను స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో మళ్లీ టెస్టు మ్యాచ్ జరగనుంది.
చెపాక్ టెస్టు విజయంతో భారత్ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారీ తేడాతో ఓడిపోయిన బంగ్లాదేశ్ టీమ్ ఆరో స్థానానికి పడిపోయింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ లైవ్‌లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉచితంగా వీక్షించాలో తెలుసుకుందాం.
రెండో టెస్టు ఎప్పుడు?
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఎక్కడ జరుగుతుంది?
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో శుక్రవారం నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు రెండో టెస్టు ప్రారంభం కానుండగా, మ్యాచ్ టాస్ అరగంట ముందు అంటే ఇరు జట్ల కెప్టెన్లు 9 గంటలకు మైదానంలోకి వచ్చి టాస్ వేస్తారు.
టీవీలో ప్రత్యక్షంగా చూడటం ఎలా?
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టును టీవీలో స్పోర్ట్స్ 18లోని ఛానళ్లలో వివిధ భాషల్లో వీక్షించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎక్కడ ప్రసారం చేస్తారు?
జియా సినిమా యాప్‌లో భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టును భారత అభిమానులు ఉచితంగా చూడొచ్చు.
భారత టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).
బంగ్లాదేశ్ టెస్టు జట్టు
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా హసన్ జాయ్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్ (వికెట్ కీపర్), జాకీర్ హసన్, షాద్మన్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, నహీద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, తైజుల్ ఇస్లాం