IND vs BAN 1st Test Toss: చెన్నై టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ - ఇండియా బ్యాటింగ్
IND vs BAN 1st Test Toss:చెన్నై వేదికగా గురువారం (నేటి) నుంచి ఇండియా, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్...టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది.
IND vs BAN 1st Test Toss: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య నేడు (గురువారం) తొలి టెస్ట్ ప్రారంభమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది.
దాదాపు రెండు నెలల గ్యాప్ టీమిండియా ఆడుతోన్న మ్యాచ్ కావడంతో రిజల్ట్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టెస్ట్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ముందడుగు వేయాలని టీమిండియా భావిస్తోంది.
టీమిండియాదే ఆధిపత్యం...
బలాబలాల పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్‌పై టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియా, బంగ్లాదేశ్ మధ్య 13 టెస్ట్‌లు జరగ్గా.. అందులో పదకొండు మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు టెస్ట్‌లు రద్దయ్యాయి. టీమిండియాపై బంగ్లా ఇప్పటివరకు బోణీ చేయలేకపోయింది.
ఐదుగురు బౌలర్లు...
ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో టీమిండియా బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్‌కు తోడు కొత్త పేసర్ ఆకాష్ దీప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చెపాక్ స్టేడియంలో స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్‌లకు ఘనమైన రికార్డు ఉంది. మరోసారి వీరిద్దరు చెలరేగితో బంగ్లాదేశ్‌కు కష్టాలు తప్పవు. యశస్వి జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్ గిల్ ఇద్దరికి తుది జట్టులో టీమ్ మేనేజ్‌మెంట్ స్థానం కల్పించింది. అయితే రోహిత్‌తో జైస్వాల్ ఓపెనర్‌గా బరిలో దిగనున్నాడు. ఈ టెస్ట్‌లో కోహ్లితో పాటు రాహుల్ ఎలా ఆడుతారన్నడి క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
పాకిస్థాన్ క్లీన్ స్వీప్…
ప్రస్తుతం ఫార్ పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ కూడా బలంగానే కనిపిస్తోంది. ఇటీవలే టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసి సంచలనం సృష్టించింది. ఆ సమరోత్సాహంతోనే అదే జట్టుతో చెన్నై టెస్ట్‌లో బంగ్లాదేశ్ బరిలో దిగుతోంది. స్పిన్‌తోనే భారత్‌ను దెబ్బకొట్టాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. మెహదీ హసన్, షకీబ్ అల్ హసన్, హసన్ మహమద్‌లతో స్పిన్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లోనూ
టీమిండియా తుది జట్టు ఇదే!
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, అక్షదీప్
బంగ్లాదేశ్ తుది జట్టు ఇదే!
షాద్‌మన్ ఇస్లాం, జాకీర్ హసన్, నజ్‌ముల్ హుస్సైన్ షాంటో, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకిబుల్ హసన్, లిట్టన్ దాస్, మెహదీ హసన్, టాస్కిన్ అహ్మద్, హసన్ మహమద్, నిహద్ రానా