తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టు ఇదే.. అతనిపై వేటు ఖాయమే.. కన్ఫమ్ చేసిన అసిస్టెంట్ కోచ్

Ind vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టు ఇదే.. అతనిపై వేటు ఖాయమే.. కన్ఫమ్ చేసిన అసిస్టెంట్ కోచ్

Hari Prasad S HT Telugu

22 October 2024, 15:48 IST

google News
    • Ind vs NZ 2nd Test: న్యూజిలాండ్ తో పుణెలో జరగబోయే రెండో టెస్టుకు ఇండియా తుది జట్టు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ కోచ్ టెన్ డూషాట్ చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే.. తుది జట్టులో కేఎల్ రాహుల్ కు చోటు కష్టమే అని తేలిపోయింది.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టు ఇదే.. అతనిపై వేటు ఖాయమే.. కన్ఫమ్ చేసిన అసిస్టెంట్ కోచ్
న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టు ఇదే.. అతనిపై వేటు ఖాయమే.. కన్ఫమ్ చేసిన అసిస్టెంట్ కోచ్ (ANI)

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టు ఇదే.. అతనిపై వేటు ఖాయమే.. కన్ఫమ్ చేసిన అసిస్టెంట్ కోచ్

Ind vs NZ 2nd Test: న్యూజిలాండ్ తో తొలి టెస్టు ఓడిన తర్వాత రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక టీమిండియాకు సవాలుగా మారింది. ఎవరు ఉంటారు? ఎవరిని తీసేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉండటంతో అతని స్థానంలో ఎవరిని పక్కన పెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాహుల్ స్థానంలోనే గిల్

న్యూజిలాండ్ తో తొలి టెస్టుకు శుభ్‌మన్ గిల్ గాయపడటంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. రెండో ఇన్నింగ్స్ లో భారీ సెంచరీతో అతడు తన చోటు ఖాయం చేసుకున్నాడు. టాప్ ఫామ్ లో ఉన్న గిల్ ను తీసుకోవాలంటే ఎవరో ఒకరిపై వేటు పడాల్సిందే. ఆ వ్యక్తి కేఎల్ రాహులే అని క్రికెట్ పండితులు, అభిమానులు ఫిక్సయిపోయారు.

ఇండియా అసిస్టెంట్ కోచ్ టెన్ డూషాట్ కూడా ఇప్పుడదే కన్ఫమ్ చేస్తున్నాడు. తొలి టెస్టులో మోకాలి గాయానికి గురైన రిషబ్ పంత్ రెండో టెస్టుకు ఫిట్ గా ఉన్నట్లు అతడు స్పష్టం చేశాడు. అంతేకాదు.. గిల్ కూడా తుది జట్టులోకి రావడం ఖాయమన్న హింట్ ఇచ్చాడు. కండిషన్స్ ను బట్టి తుదిజట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.

"అందరూ చాలా బాగున్నారు. తొలి టెస్టులో బౌలింగ్ అంతగా వేయలేదు. ఫాస్ట్ బౌలర్లు బాగానే వేశారు. రిషబ్ చాలా బాగున్నాడు. మొన్న కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ.. పుణె టెస్టులో వికెట్ కీపింగ్ అతడే చేస్తాడని అనుకుంటున్నాను" అని టెన్ డుషాట్ అన్నాడు.

"గిల్ తుది జట్టులోకి వచ్చేలానే ఉన్నాడు. బెంగళూరులో బాగానే బ్యాటింగ్ చేశాడు. కాస్త అసౌకర్యంగా కనిపించాడు కానీ ఆడటానికి అతడు సిద్ధంగా ఉన్నాడు" అని అతడు తెలిపాడు. గిల్ తిరిగి వస్తే మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. కోహ్లి మళ్లీ నాలుగో స్థానానికి వెళ్తాడు. ఇక సర్ఫరాజ్ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగాల్సి వస్తుంది.

ఆరు స్థానాలకు ఏడుగురు

తుది జట్టులో స్థానం కోసం గట్టి పోటీయే ఉందన్న విషయాన్ని టెన్ డుషాట్ అంగీకరించాడు. "జట్టులో స్థానం కోసం పోటీ ఉంది. తొలి టెస్టు తర్వాత కేఎల్ దగ్గరికి వెళ్లాను. నువ్వు ఎన్ని ఆడటానికి ప్రయత్నించి ఫెయిలయ్యావు అని అడిగాను. అతడు ఒక్క బాల్ కూడా ఆడటానికి వెళ్లి మిస్ కాలేదు.

రన్స్ చేయలేనప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కేఎల్ రాహుల్ విషయంలో ఆందోళనేమీ లేదు. అయితే మా దగ్గర ఉన్న ఆరు స్థానాల కోసం ఏడుగురు ఉన్నారు. కండిషన్స్ ను చూసి తుది జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది" అని డుషాట్ అన్నాడు.

1988 తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో ఓ టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడింది. ఇప్పుడు సిరీస్ లో నిలవాలంటే రెండో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆచితూచి వ్యవహరించనుంది.

తదుపరి వ్యాసం