IND vs NZ: రెండో టెస్టులో కేఎల్ రాహుల్‍పై వేటు! రెడీ అవుతున్న గిల్-kl rahul out shubhman gill in for india final playing xi in second test against new zealand ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ind Vs Nz: రెండో టెస్టులో కేఎల్ రాహుల్‍పై వేటు! రెడీ అవుతున్న గిల్

IND vs NZ: రెండో టెస్టులో కేఎల్ రాహుల్‍పై వేటు! రెడీ అవుతున్న గిల్

Oct 20, 2024, 10:49 PM IST Chatakonda Krishna Prakash
Oct 20, 2024, 10:47 PM , IST

  • IND vs NZ: న్యూజిలాండ్‍తో రెండో టెస్టులో భారత తుది జట్టులో కేఎల్ రాహుల్‍కు చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. శుభ్‍మన్ గిల్ గాయం నుంచి కోలుకోవటంతో రాహుల్‍పై వేటు పడే ఛాన్స్ ఉంది.

న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో చివరి రోజైన నేడు (అక్టోబర్ 20) 8 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‍లో రెండో మ్యాచ్ పుణె వేదికగా అక్టోబర్ 24న మొదలుకానుంది. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో కేఎల్ రాహుల్‍కు చోటు దక్కకపోవచ్చు. 

(1 / 5)

న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో చివరి రోజైన నేడు (అక్టోబర్ 20) 8 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‍లో రెండో మ్యాచ్ పుణె వేదికగా అక్టోబర్ 24న మొదలుకానుంది. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో కేఎల్ రాహుల్‍కు చోటు దక్కకపోవచ్చు. (AFP)

న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత యంగ్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్ ఆడాల్సింది. అయితే, మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్‍కు అతడు దూరమయ్యాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్‍కు చోటు దక్కింది. 

(2 / 5)

న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత యంగ్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్ ఆడాల్సింది. అయితే, మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్‍కు అతడు దూరమయ్యాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్‍కు చోటు దక్కింది. (AFP)

గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో  150 పరుగులతో దుమ్మురేపాడు. టెస్టు కెరీర్‌తో తొలి శకతంతో అదరగొట్టాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా పుంజుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రెండో టెస్టులో సర్ఫరాజ్‍ కొనసాగనున్నాడు. 

(3 / 5)

గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో  150 పరుగులతో దుమ్మురేపాడు. టెస్టు కెరీర్‌తో తొలి శకతంతో అదరగొట్టాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా పుంజుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రెండో టెస్టులో సర్ఫరాజ్‍ కొనసాగనున్నాడు. (HT_PRINT)

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన సమయంలో 12 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో, విఫలమైన రాహుల్‍ను రెండో టెస్టులో తుది జట్టు నుంచి తప్పించి గిల్‍ను తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్ భావిస్తోంది. 

(4 / 5)

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన సమయంలో 12 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో, విఫలమైన రాహుల్‍ను రెండో టెస్టులో తుది జట్టు నుంచి తప్పించి గిల్‍ను తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్ భావిస్తోంది. (PTI)

శుభ్‍మన్ గిల్ గాయం నుంచి దాదాపు కోలుకున్నాడని తొలి టెస్టు ముగిశాక మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈ మ్యాచ్ ముగిశాక చిన్నస్వామి స్టేడియంలో గిల్ ప్రాక్టీస్ కూడా చేశాడు. దీంతో రెండో టెస్టుకు అతడు సిద్ధమైనట్టే తెలుస్తోంది. దీంతో రాహుల్‍ను ఔట్ అయి.. గిల్‍ను రెండో టెస్టు కోసం తుది జట్టులో గిల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

(5 / 5)

శుభ్‍మన్ గిల్ గాయం నుంచి దాదాపు కోలుకున్నాడని తొలి టెస్టు ముగిశాక మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈ మ్యాచ్ ముగిశాక చిన్నస్వామి స్టేడియంలో గిల్ ప్రాక్టీస్ కూడా చేశాడు. దీంతో రెండో టెస్టుకు అతడు సిద్ధమైనట్టే తెలుస్తోంది. దీంతో రాహుల్‍ను ఔట్ అయి.. గిల్‍ను రెండో టెస్టు కోసం తుది జట్టులో గిల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు