IPL 2025: లక్షల నుంచి కోట్లలోకి - క్యాప్‌డ్ ప్లేయర్స్‌గా నితీష్, మాయాంక్ యాదవ్‌లకు ఛాన్స్?
03 October 2024, 12:26 IST
IPL 2025: సన్‌రైజర్స్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నుంచి క్యాప్‌డ్ ప్లేయర్‌గా మారే అవకాశం ఉంది. నితీష్‌తో పాటు మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడిన క్యాప్‌డ్ ప్లేయర్‌గా మారుతారు.
ఐపీఎల్ 2025
IPL 2025: ఐపీఎల్ మెగావేలంతో పాటు రిటైన్ ప్లేయర్లుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ పాలకమండలి అవకాశం ఇచ్చింది. అందులో ఇద్దరు మాత్రమే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండాలని రూల్ పెట్టింది. రిటైన్ ప్లేయర్లకు సంబంధించి క్యాప్‌డ్, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కోసం వెచ్చించాల్సిన ధరలను ఐపీఎల్ డిసైడ్ చేసింది.
కాగా ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్ కోటాలో ఆడుతోన్న తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్‌కు క్యాప్‌డ్ ప్లేయర్‌గా మారే అవకాశం వచ్చింది. అతడితో పాటు స్పీడ్‌స్టార్ మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా కూడా ఈ అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌తో సిరీస్...
బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో నితీష్‌కుమార్‌రెడ్డి, మయాంక్ యాదవ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు తుది జట్టులో ఆడితే క్యాప్‌డ్ ప్లేయర్లుగా పరిగణించబడతారు.
అక్టోబర్ 31 వరకు డెడ్‌లైన్...
ఐపీఎల్ 2025లో క్యాప్‌డ్ ప్లేయర్లుగా పరిగణించబడాలంటే ఈ నెల (అక్టోబర్) 31 కంటే ముందు టీమిండియాలోకి అరంగేట్రం చేసి ఉండాలి. కనీసం ఒక్క మ్యాచ్ ఆడిన వారు క్యాప్‌డ్ ప్లేయర్లుగానే పరిగణించబడతారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో నితీష్‌కుమార్ రెడ్డితో పాటు మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాలు కనీసం ఒక్క మ్యాచ్ లో అవకాశం దక్కినా క్యాప్‌డ్ ప్లేయర్లుగా మారుతారు.
ఇరవై లక్షల నుంచి కోట్లు...
అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు కావడంతో నితీష్‌కుమార్, మయాంక్ యాదవ్‌లను ఐపీఎల్ వేలంలో 20 లక్షల ధరకే అమ్ముడుపోయారు. ఒకవేళ క్యాప్‌డ్ ప్లేయర్లుకుగా మారితే వారు కోట్లకు అమ్ముడుపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే ఫ్రాంచైజ్‌లకు దెబ్బపడుతుంది. దాంతో నితీష్‌కుమార్‌రెడ్డి, మయాంయ్ యాదవ్‌తో పాటు హర్షిత్ రాణాలను బంగ్లాదేశ్ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడించవద్దని ఫ్రాంఛైజ్‌లో కోచ్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ను రిక్వెస్ట్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సన్‌రైజర్స్…
ఐపీఎల్‌లో నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ తరఫున ఆడుతోండగా...మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్, హర్షిత్ రాణా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్నారు. అక్టోబర్ 6న ఇండియా, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది.