Sanju Samson Ruled Out Sl Series: గాయంతో టీ20 సిరీస్‌కు సంజూ శాంస‌న్ దూరం - జితేన్ శ‌ర్మ అరంగేట్రం-sanju samson ruled out of sri lanka t20 series due to knee injury ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sanju Samson Ruled Out Sl Series: గాయంతో టీ20 సిరీస్‌కు సంజూ శాంస‌న్ దూరం - జితేన్ శ‌ర్మ అరంగేట్రం

Sanju Samson Ruled Out Sl Series: గాయంతో టీ20 సిరీస్‌కు సంజూ శాంస‌న్ దూరం - జితేన్ శ‌ర్మ అరంగేట్రం

Nelki Naresh Kumar HT Telugu
Jan 05, 2023 08:37 AM IST

Sanju Samson Ruled Out SL Series:గాయం కార‌ణంగా టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ సంజూ శాంస‌న్ శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో పంజాగ్ కింగ్స్ వికెట్ కీప‌ర్ జితేన్ శ‌ర్మ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

సంజూ శాంస‌న్
సంజూ శాంస‌న్

Sanju Samson Ruled Out SL Series: శ్రీలంక‌తో రెండో టీ20 నేప‌థ్యంలో టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ త‌గిలింది. గాయం కార‌ణంగా సంజూ శాంస‌న్ శ్రీలంక‌తో జ‌రుగుతోన్న టీ20 సిరీస్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. శ్రీలంక సిరీస్‌లో రాణించి జ‌ట్టులో స్థానం ప‌దిలం చేసుకోవాల‌ని అనుకున్న సంజూ శాంస‌న్ ఆశ‌ల‌కు గాయం కార‌ణంగా గండిప‌డింది.

ఒక్క మ్యాచ్‌తోనే స‌రిపెట్టుకోవాల్సివ‌చ్చింది. వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తోన్న స‌మ‌యంలో సంజూ శాంస‌న్ గాయ‌ప‌డ్డాడు. అత‌డి ఎడ‌మ మోకాలికి గాయ‌మైంది. ఈ గాయం తీవ్ర‌త‌ను అంచ‌నా వేయ‌డానికి సంజూ శాంస‌న్‌కు బీసీసీఐ మెడిక‌ల్ టీమ్‌ స్కానింగ్‌తో పాటు ఇత‌ర వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

సంజూ శాంస‌న్‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించ‌డంతో మిగిలిన రెండు టీ20ల నుంచి అత‌డిని త‌ప్పిస్తున్న‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది. తొలి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

జితేన్ శ‌ర్మ అరంగేట్రం

గాయ‌ప‌డిన సంజూ శాంస‌న్ స్థానంలో విద‌ర్భ వికెట్ కీప‌ర్ జితేన్ శ‌ర్మ‌ను ఎంపిక‌చేసింది బీసీసీఐ. శ్రీలంక టీ20 సిరీస్‌తోనే జితేన్ శ‌ర్మ టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేయ‌బోతున్నాడు. ఐపీఎల్‌లో పంజాగ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన జితేన్ 12 మ్యాచ్‌ల‌లో 234 ర‌న్స్ చేసి ఆక‌ట్టుకున్నాడు.

కానీ శ్రీలంక‌తో టీ20 సిరీస్‌లో జితేన్‌ శ‌ర్మ‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం మాత్రం అనుమానంగానే క‌నిపిస్తోంది. తొలి టీ20 విజ‌యం నేప‌థ్యంలో టీమ్‌లో మేనేజెమంట్ మార్పులు చేయ‌క‌పోవ‌చ్చున‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.