WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా నంబర్ వన్ మరింత పదిలం.. పడిపోయిన బంగ్లాదేశ్
- WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానం మరింత పదిలంగా మారింది. బంగ్లాదేశ్ ను రెండో టెస్టులోనూ 7 వికెట్లతో చిత్తు చేసి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత రోహిత్ సేన ఆస్ట్రేలియాకు అందనంత ఎత్తుకు చేరింది.
- WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానం మరింత పదిలంగా మారింది. బంగ్లాదేశ్ ను రెండో టెస్టులోనూ 7 వికెట్లతో చిత్తు చేసి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత రోహిత్ సేన ఆస్ట్రేలియాకు అందనంత ఎత్తుకు చేరింది.
(1 / 6)
WTC Points Table: కాన్పూర్ టెస్టులో ఊహకందని విజయం సాధించి బంగ్లాదేశ్ ను రెండు టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ కు బజ్‌బాల్ ను పరిచయం చేసిన ఇంగ్లండే ఆశ్చర్యపోయేలా కాన్పూర్ లో ఆడిన టీమిండియా.. కేవలం రెండే రోజుల్లో టెస్టును ముగించడం విశేషం.
(2 / 6)
WTC Points Table: బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా 74.24 పర్సెంటేజీ పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది.(BCCI)
(3 / 6)
WTC Points Table: ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇండియా ఇప్పటి వరకూ 11 టెస్టులు ఆడి 8 విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో మొత్తం 98 పాయింట్లు సాధించింది.(AFP)
(4 / 6)
WTC Points Table: పాయింట్ల పరంగా, పర్సెంటేజీ పాయింట్ల పరంగా కూడా రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియా 12 మ్యాచ్ లలో 8 విజయాలు, 3 ఓటములు, 1 డ్రాతో 90 పాయింట్లు, 62.50 పర్సెంటేజీ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.(AFP)
(5 / 6)
WTC Points Table: పాకిస్థాన్ ను వాళ్ల సొంత దేశంలో 2-0తో ఓడించి ఎంతో గర్వంగా ఇండియాలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ కు ఈ ఓటమి అస్సలు మింగుడుపడనిదే. ముఖ్యంగా రెండో టెస్టులో అసలు ఊహించని ఓటమి ఎదురైంది. ఈ ఓటమితో ఆ టీమ్ డబ్ల్యూటీసీ టేబుల్లో ఏడో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ ఈ సైకిల్లో 8 మ్యాచ్ లు ఆడి, 3 గెలిచి, 5 ఓడి.. 33 పాయింట్లు, 34.78 పర్సెంటేజీ పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.(PTI)
ఇతర గ్యాలరీలు