Gilchrist to Team India: సచిన్, ధోనీలను పిలవండి.. వరల్డ్ కప్ గెలిపిస్తారు: గిల్‌క్రిస్ట్
19 September 2023, 15:14 IST
- Gilchrist to Team India: సచిన్, ధోనీలను పిలవండి.. వాళ్లతో యువ ప్లేయర్స్ కు సలహాలు, సూచనలు ఇప్పించండి.. వరల్డ్ కప్ గెలిపిస్తారు అని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ అన్నాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్, ధోనీ, సచిన్
Gilchrist to Team India: సచిన్, ధోనీ.. ఈ ఇద్దరూ చివరిసారి ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమ్ లో ఉన్నారు. సచిన్ కు అదే చివరి వరల్డ్ కప్ కాగా.. ధోనీ కెప్టెన్ గా అతని చిరకాల కోరికను నెరవేర్చాడు. అయితే ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మరోసారి ఇండియా స్వదేశంలో వరల్డ్ కప్ గెలవాలంటే మాత్రం ఈ ఇద్దరి సేవలను వినియోగించుకోవాలని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు.
స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడిన గిల్‌క్రిస్ట్.. సచిన్, ధోనీతోపాటు యువరాజ్ సింగ్ పేరు కూడా చెప్పాడు. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈ ముగ్గురిదే కీలకపాత్ర. దీంతో వీళ్లను పిలిచి వాళ్ల అనుభవాన్ని యువ ప్లేయర్స్ తో పంచుకునేలా చేయాలని గిల్లీ సూచించడం విశేషం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలో వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే.
"ఓ ఇండియన్ ప్లేయర్ గా ఇండియాలో ఆడటం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ప్రతిసారీ అక్కడ ఆడటం ఉత్కంఠగా ఉంటుంది. ఒకవేళ నేను ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ లో ఉంటే మాత్రం నేను సచిన్, ధోనీలాంటి ప్లేయర్స్ ను పిలిచి వాళ్ల అనుభవాన్ని యువ ప్లేయర్స్ కు పంచాలని సూచిస్తాను. యువరాజ్ లాంటి ప్లేయర్ ను కూడా పిలుస్తాను. 2011 వరల్డ్ కప్ సమయంలో అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలుసు" అని గిల్‌క్రిస్ట్ అన్నాడు.
"అప్పట్లో ఓ సాధారణ ప్లేయర్ గా జట్టులో ఉన్న విరాట్ కోహ్లి ఎలాగూ ఇప్పటి టీమ్ లో ఉన్నాడు. స్వదేశంలో వరల్డ్ కప్ ఆడటం ఎలా ఉంటుంది? వాళ్లెలా గెలిచారన్నది వాళ్లతో చెప్పిస్తే బాగుంటుంది. బయట నుంచి వచ్చే ఒత్తిడికి చెక్ పెడితే అత్యుత్తమ క్రికెట్ ఆడే వీలుంటుంది" అని గిల్లీ చెప్పాడు.
ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌పై..
ఇక వరల్డ్ కప్ కంటే ముందు జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ పైనా గిల్‌క్రిస్ట్ స్పందించాడు. వరల్డ్ కప్ కు ముందు ఇది సరైన సంసిద్ధత కోసం ఉపయోగపడుతుందని అతడు అభిప్రాయపడ్డాడు.
"ఈ సిరీస్ జరిగే వేదికలు, అక్కడి పరిస్థితులు ఇండియా, ఆస్ట్రేలియా సంసిద్ధతలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆస్ట్రేలియా, ఇండియా సిరీస్ కంటే మంచి సంసిద్ధత మరొకటి ఉండదు. ఈ రెండు టీమ్స్ వరల్డ్ కప్ టైటిల్ రేసులో ఉన్నాయి. వరల్డ్ కప్ లో ఎదురవబోయే పిచ్ లే ఈ సిరీస్ లోనూ ఉంటే మాత్రం అత్యుత్తమ తుది జట్టు ఏదో తేల్చుకునేందుకు ఇది బాగా పనికొస్తుంది" అని గిల్‌క్రిస్ట్ అన్నాడు.