Yuvraj Singh: యువరాజ్ సింగ్‍కు పుత్రికోత్సాహం.. పేరు కూడా వెల్లడించిన యువీ
Yuvraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హేజల్ కీచ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని యువీ వెల్లడించారు.
Yuvraj Singh: భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్‍కు పుత్రికోత్సాహం కలిగింది. యువీ భార్య హేజెల్ కీచ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని యువరాజ్ సింగ్ నేడు (ఆగస్టు 25) వెల్లడించారు. ఈ గుడ్‍న్యూస్‍ను తన అభిమానులు, ఫాలోవర్లతో పంచుకున్నారు. నిద్రలేని రాత్రులు తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని ఇన్‍స్టాగ్రామ్‍లో ఫొటో పోస్ట్ చేశారు యువీ. తమ కుటుంబం పరిపూర్ణం అయిందని తెలిపారు. అలాగే తన కూతురి పేరుకు కూడా వెల్లడించారు. యువరాజ్, హేజెల్ దంపతులకు ఇప్పటికే కుమారుడు ఉండగా.. ఇప్పుడు రెండో సంతానంగా వారి ఇంట ఆడపిల్ల అడుగుపెట్టింది. తన కూతురి పేరు, ఫొటోను కూడా యువరాజ్ వెల్లడించారు.
తమ కుమార్తెకు 'ఆరా' అని పేరు పెట్టినట్టు యువరాజ్ తెలిపారు. ఈ మేరకు ఫొటోను కూడా ఆయన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. “మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసేందుకు మా లిటిల్ ప్రిన్సెస్ ఆరా (Aura) వచ్చింది. నిద్రలేని రాత్రులు మాకు చాలా ఆనందంగా మారాయి” అని యవరాజ్ క్యాప్షన్ పెట్టారు. కుమార్తెను తాను ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేశారు యువీ.
హేజల్ కీచ్‍తో ఉన్న ఫొటోలను యువరాజ్ సింగ్ షేర్ చేశారు. కుమార్తెను యువీ ఎత్తుకున్నారు. హేజల్ ఒడిలో కుమారుడు ఉన్నాడు. యువరాజ్, హేజల్ కీచ్‍కు 2016లో వివాహం జరిగింది. 2022లో మగబిడ్డకు హేజల్ జన్మనిచ్చారు. కుమారుడికి ఒరియన్ కీచ్ సింగ్ అని పేరు పెట్టారు యువీ. ఇప్పుడు రెండో సంతానంగా వారికి ఆడబిడ్డ జన్మించింది. కుమార్తెకు ఆరా అని పేరు పెట్టారు. యువరాణి ఆరా రాకతో తమ కుటుంబం పరిపూర్ణం అయిందని యువరాజ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలను టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించారు. తన 17ఏళ్ల కెరీర్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లో సత్తాచాటారు యువీ. భారత్‍కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. క్రికెట్ చరిత్రలో ఒకానొక బెస్ట్ ఆల్‍రౌండర్‌గా యువీ నిలిచారు. 2019 జూన్‍లో అంతర్జాతీయ క్రికెట్‍కు యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని విదేశీ లీగ్‍ల్లో ఆడుతున్నారు.