తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ben Stokes: ‘అంపైర్స్ కాల్’ తీసేయాలి: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఆ డీఆర్ఎస్ నిర్ణయంపై అసంతృప్తి

Ben Stokes: ‘అంపైర్స్ కాల్’ తీసేయాలి: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఆ డీఆర్ఎస్ నిర్ణయంపై అసంతృప్తి

18 February 2024, 23:19 IST

google News
    • IND vs ENG Test Series - Ben Stokes: డీఆర్ఎస్‍లో అంపైర్స్ కాల్ గురించి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంపైర్స్ కాల్ తీసేయాలని అన్నాడు. మూడో టెస్టులో ఓ డీఆర్ఎస్ నిర్ణయంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. 
Ben Stokes: ‘అంపైర్స్ కాల్’ తీసేయాలి: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఆ డీఆర్ఎస్ నిర్ణయంపై అసంతృప్తి
Ben Stokes: ‘అంపైర్స్ కాల్’ తీసేయాలి: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఆ డీఆర్ఎస్ నిర్ణయంపై అసంతృప్తి (ANI )

Ben Stokes: ‘అంపైర్స్ కాల్’ తీసేయాలి: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఆ డీఆర్ఎస్ నిర్ణయంపై అసంతృప్తి

Ben Stokes: భారత్ చేతిలో మూడో టెస్టులో ఇంగ్లండ్ చిత్తుగా ఓడింది. రాజ్‍కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో నాలుగో రోజైన నేడు (ఫిబ్రవరి 18) టీమిండియా 434 రన్స్ తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఓ డీఆర్ఎస్ నిర్ణయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్‍)లో అంపైర్స్ కాల్ తొలగించాలని అన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఎల్‍బీడబ్ల్యూపై బెన్ స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్‍లో ఆ బంతి వికెట్లను మిస్ అయినట్టు కనిపించిందని, కానీ అంపైర్స్ కాల్ వచ్చిందని స్పోర్ట్స్ టాక్‍తో స్టోక్స్ అన్నాడు. క్రాలీ డీఆర్ఎస్‍పై తమకు క్లారిటీ కావాలని అన్నాడు.

మాకు క్లారిటీ కావాలి

“బాల్ స్టంప్స్‌ను మిస్ అయినట్టు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే, బంతి స్టంప్స్‌కు తగలకపోయినా అంపైర్స్ కాల్ అని చూపించింది. ఇది చాలా తికమకగా ఉంది. హాక్-ఐ నిర్వహించే వారి నుంచి మాకు కాస్త క్లారిటీ కావాలి” అని స్టోక్స్ అన్నాడు.

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జాక్ క్రాలీ ఎల్‍బీడబ్ల్యూ అయ్యాడు. బుమ్రా వేసిన 9వ ఓవర్ రెండో బంతి క్రాలీ ప్యాడ్‍కు తిగిలింది. దీంతో భారత ప్లేయర్లు అప్పీల్ చేశారు. ఆన్ ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన ఔట్ ఇచ్చారు. అయితే, క్రాలీ.. డీఆర్ఎస్‍కు వెళ్లాడు. అయితే, డీఆర్ఎస్‍లో అంపైర్ కాల్ రావటంతో క్రాలీ ఔట్‍గా వెనుదిరిగాడు. అయితే, బంతి స్టంప్‍లను మిస్ అయినట్టు కనిపిస్తున్నా.. అంపైర్స్ కాల్ ఎలా వచ్చిందని స్టోక్స్ ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

క్రాలీ తీసుకున్న డీఆర్ఎస్‍లో తప్పుడు ప్రొజెక్షన్ వల్ల బంతి వికెట్లను తగిలినట్టు అంపైర్స్ కాల్ అని చూపించిందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‍.. ఔట్ విషయంలోనూ అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్‍లో అంపైర్స్ కాల్ తీసేయాలని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.

డీఆర్ఎస్‍లో అంపైర్స్ కాల్ విషయం చాలాసార్లు వివాదాస్పదమైంది. చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్ఎస్‍లో ఔట్, నాటౌట్ ఈ రెండే ఉండాలని, అంపైర్స్ కాల్ వల్ల గందరగోళం ఉందని కొందరు చెప్పారు. భారత స్టార్ విరాట్ కోహ్లీ కూడా అంపైర్స్ కాల్ తీసేయాలని గతంలో ఓ సారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

సిరీస్‍లో భారత్ ఆధిక్యం

రాజ్‍కోట్‍లో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై టీమిండియా గెలిచింది. పరుగుల పరంగా భారత్‍కు టెస్టు చరిత్రలో అత్యంత భారీ విజయం ఇదే. ఈ విజయంతో ఈ ఐదు టెస్టుల సిరీస్‍లో 2-1తో ముందంజ వేసింది టీమిండియా. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, రవీంద్ర జడేజా ఆల్‍రౌండ్ షో, అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ రెండు అర్ధ శతకాలతో అదరగొట్టడంతో మూడో టెస్టులో భారత్‍కు భారీ గెలుపు దక్కింది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 23న రాంచీలో నాలుగు టెస్టు మొదలుకానుంది.

తదుపరి వ్యాసం