CSK VS GT : సీఎస్కేపై గుజరాత్ టైటాన్స్‌దే పైచేయి.. ఈసారి ఏం జరుగుతుంది?
26 March 2024, 6:49 IST
- CSK VS GT IPL 2024 : ఐపీఎల్ 2024లో నేడు సీఎస్కేతో తలపడనుంది జీటీ. ఈ రెండు జట్ల హెడ్ టు హెడ్ స్టాట్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్..
CSK VS GT head to head : ఐపీఎల్ 2024లో మరో రసవత్త మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది! మంగళవారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)- గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. చెన్నై వేదికగా జరగుతోంది ఈ మ్యాచ్. రెండు జట్లకు యంగ్ కెప్టెన్స్ రావడంతో మ్యాచ్‌పై అంచనాలు మరింత పెరిగాయి. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ శుభ్‌మాన్ గిల్లో ఎవరు గెలుస్తారు? అని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ ప్రివ్యూ, హెడ్-టు-హెడ్ కౌంట్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
సీఎస్కే వర్సెస్ జీటీ- గిల్ సేనదే పైచేయి!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కొత్త జట్టు. 2022లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందుకే ఈ జట్టు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఐదు సార్లు తలపడింది గుజరాత్ టైటాన్స్. తక్కువ మ్యాచ్‌లే ఆడినా అద్భుత ప్రదర్శన చేసింది! ఫలితంగా.. అరంగేట్రం చేసిన సీజన్లోనే ట్రోఫీని అందుకుంది. ఇక.. సీఎస్కేతో జరిగిన 5 మ్యాచ్‌లలో 3సార్లు జీటీ విజయం సాధించింది. రెండు విజయాలు.. సీఎస్కే ఖాతాలోకి వెళ్లాయి.
అంటే.. ఈ రెండు జట్ల మధ్య విక్టరీ ప్రస్తుతం 3-2గా ఉంది. ఈ మ్యాచ్‌లో జీటీ గిల్ సేన గెలిస్తే.. డిఫరెన్స్ మరింత పెరుగుతుంది. లేక.. సీఎస్కే విజయం సాధిస్తే.. రెండు జట్లు సమానం అవుతాయి.
CSK VS GT 2024 : పైగా.. ఐపీఎల్ 2024లో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు గెలిచాయి. ఆర్సీబీతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్‌పై గెలిచి.. చెన్నైలో ఆత్మ విశ్వాసంతో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్.
స్టాట్స్.. పిచ్ కండీషన్.. టాస్..
రషీద్ ఖాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్లేయర్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఒకరు. 7 ఇన్నింగ్స్‌లలో 60 బాల్స్ ఎదుర్కొని 95 రన్స్ చేశాడు. యావరేజ్ 47.గా ఉంది. స్ట్రైక్ రట్ 158.3.
ఐపీఎల్ 2023 నుంచి ఆజింక్య రహానే దూకుడుగా ఆడుతున్నాడు. అతని మొదటి 10 బాల్స్ స్ట్రైక్ రేట్ 158.3గా ఉంది. 2018-2020 వరకు అది 85.1గా ఉండేది.
IPL 2024 today match : సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌ని చితక బాదడం అలవాటు! 7 ఇన్నింగ్స్‌లలో 38 బాల్స్‌ని ఎదుర్కొని 68 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 180 దగ్గర ఉంది. ఒక్కసారి మాత్రమే ఔట్ అయ్యాడు.
ఐపీఎల్ 2023 నుంచి గుజరాత్ టైటాన్స్ బౌలర్లు.. పవర్‌ప్లేలో 25 వికెట్లు తీశారు! మరే ఇతర జట్టు కూడా ఇన్ని వికెట్లు తీయలేదు.
పిచ్ కండీషన్:- చెపాక్ స్టేడియం సాధారణంగా స్పీనర్లకు అనుకూలిస్తుంది. కానీ ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‌లో స్పినర్లు ఇక్కడ ఒక్క వికెట్ కూడా తీయలేదు! 2015 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
టాస్:- టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.