World Cup 2023 warm-up matches: వరల్డ్ కప్‌కు ముందు ఇండియా వామప్ మ్యాచ్‌లు ఈ టీమ్స్‌తోనే..
24 August 2023, 8:05 IST
- World Cup 2023 warm-up matches: వరల్డ్ కప్‌కు ముందు ఇండియా వామప్ మ్యాచ్‌లు రెండు టీమ్స్ తో ఆడనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బుధవారం (ఆగస్ట్ 23) ఐసీసీ అనౌన్స్ చేసింది.
టీమిండియా
World Cup 2023 warm-up matches: వరల్డ్ కప్ మెగా టోర్నీ మరో 40 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇండియా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఐదు రోజుల పాటు వామప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్ టీమ్ రెండు వామప్ మ్యాచ్ లు ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, క్వాలిఫయర్ నెదర్లాండ్స్ జట్లతో ఇండియా ఈ మ్యాచ్ లు ఆడుతుంది.
ఐసీసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో టీమిండియా తన వామప్ మ్యాచ్ లు ఆడుతుంది. అక్టోబర్ 5న వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇండియా ఈ రెండు మ్యాచ్ లను గువాహటి, తిరువనంతపురంలలో ఆడుతుంది. ఈ రెండు మైదానాలతోపాటు హైదరాబాద్ కూడా వామప్ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది.
అయితే ఇక్కడ ఇండియా లీగ్ మ్యాచ్ లే కాదు వామప్ మ్యాచ్ లు కూడా ఆడటం లేదు. ఇండియా, ఇంగ్లండ్ వామప్ మ్యాచ్ గువాహటిలో సెప్టెంబర్ 30న జరుగుతుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్ తో మరో వామప్ మ్యాచ్ కోసం కేరళలోని తిరువనంతపురానికి టీమిండియా వెళ్తుంది. తొలి వామప్ మ్యాచ్ సెప్టెంబర్ 29న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది.
అదే రోజు సౌతాఫ్రికా, ఆప్ఘనిస్థాన్ మరో మ్యాచ్ లో తలపడతాయి. ఇక రెండో రోజు ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ తోపాటు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఆడుతాయి. అక్టోబర్ 2న ఇంగ్లండ్, బంగ్లాదేశ్.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. చివరి రోజు ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ తోపాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ ఆడనున్నాయి.
ఈ వామప్ మ్యాచ్ లలో హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 29న, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగుతాయి. ఇక వరల్డ్ కప్ లో ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న ఆడనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది.
టాపిక్