World Cup Qualifiers : ఫైనల్లో నెదర్లాండ్స్ ప్లేయర్స్ పెవిలియన్ పరేడ్.. చిత్తుగా ఓడించిన శ్రీలంక
World Cup Qualifiers : ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక దుమ్మురేపింది. నెదర్లాండ్స్ జట్టను చిత్తు చిత్తుగా ఓడించింది.
ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. దీంతో టాప్ సీడ్‌గా భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. హరారేలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ఓ మోస్తరు బ్యాటింగ్‌ను ప్రదర్శించినా.. బౌలింగ్‌లో అద్భుతమైన ఆటతీరుతో సులువుగా విజయం సాధించింది.
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. సహన్ అరాచ్చి అర్ధ సెంచరీ, కుసల్ మెండిస్, అసలంకల మంచి సహకారంతో శ్రీలంక ఆడింది. ఈ మొత్తాన్ని ఛేదించడం ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టు ఏ దశలోనూ శ్రీలంకకు దీటుగా సమాధానం ఇవ్వలేదు. శ్రీలంక బౌలర్ల ధాటికి షాక్ తిన్న నెదర్లాండ్ ప్లేయర్స్ పెవిలియన్ పరేడ్ నిర్వహించడం ప్రారంభించారు. వెంట వెంటనే ఔట్ అయారు. మాక్స్ ఒడాడ్ ఒక్కడే 33 పరుగులు చేసినా క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యాడు. చివరికి 105 పరుగులకే నెదర్లాండ్స్ అన్ని వికెట్లు కోల్పోయింది. దీంతో 128 పరుగులతో శ్రీలంక విజయం సాధించింది.
శ్రీలంక జట్టు : పాతుమ్ నిస్సాంక, సదీర సమరవిక్రమ, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సహన్ అరాచిగె, దసున్ షనక (సి), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ్, మతిషా పతిరణ, దిల్షన్ మధుశంక, బెంచ్: దిముత్ శంక బెంచ్ హేమంత, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార్
నెదర్లాండ్స్ జట్టు : విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, నోహ్ క్రోస్, వెస్లీ బరేసి, తేజా నిడమనూర్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, ర్యాన్ క్లీన్, ఆర్యన్ దత్, క్లేటన్ ఫ్లాయిడ్ కింగ్‌మా, షేర్‌మెడ్, బెంచ్: మైఖేల్ లెవిట్, బాస్ డి లీడ్